ePaper
More
    Homeక్రీడలుVirat Kohli | రిటైర్ అయినా సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో త‌గ్గేదే...

    Virat Kohli | రిటైర్ అయినా సరికొత్త రికార్డు సృష్టించిన కోహ్లీ.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో త‌గ్గేదే లే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Virat Kohli | టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఇటీవలే టెస్ట్, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ (T20 Formats Retirement) ప్రకటించిన ఆయన, ఐసీసీ తాజాగా విడుదల చేసిన ఆల్‌టైమ్ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనతో తన స్థాయిని నిరూపించుకున్నాడు. మూడు ఫార్మాట్లలో 900+ రేటింగ్ సాధించిన భారత ఏకైక ఆటగాడిగా నిలిచాడు. బుధవారం విడుదలైన ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings) ప్రకారం.. విరాట్ కోహ్లీ టీ20 రేటింగ్ 897 నుండి 909 పాయింట్లకు పెరిగింది. టెస్టుల్లో అతని బెస్ట్ రేటింగ్ 937, వన్డేల్లో 911. ఇప్పుడు టీ20ల్లోనూ 900 మార్క్ దాటడంతో, మూడూ ఫార్మాట్లలో 900+ రేటింగ్ సాధించిన తొలి భారత క్రికెటర్‌(First Indian Cricketer)గా చరిత్రలో నిలిచాడు.

    ఆల్‌టైమ్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (Top 3) ప్ర‌కారం చూస్తే.. డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్) – 919, విరాట్ కోహ్లీ (భారత్) – 909, సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 909 ర్యాంక్ సాధించాడు. ఇక విరాట్ కోహ్లీ టీ20 కెరీర్ గణాంకాలు చూస్తే.. మొత్తం 125 మ్యాచ్‌లు ఆడ‌గా, 4,188 పరుగులు (స్ట్రైక్ రేట్ 137.04), ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీ(Virat Kohli) మూడు ఫార్మాట్లలోనూ అత్యున్నత రేటింగ్ సాధించడం భారత క్రికెట్ చరిత్రలో మరొక గర్వకారణం. అంతర్జాతీయ వేదికపై అతని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉందని ఐసీసీ ర్యాంకింగ్స్ ద్వారా మరోసారి నిరూపితమైంది.

    గత ఏడాది ICC T20 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ టైటిల్‌ను సాధించిన అనంతరం విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ ప్రకటించిన విష‌యం తెలిసిందే. విరాట్ టీ20లో అత్యుత్తమ స్కోరు 122. ఇక టెస్టుల నుంచి ఇటీవలే కోహ్లీ రిటైర్ అయిన కోహ్లీ.. భారత్ తరపున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన నాల్గో ఆటగాడిగా కూడా స‌రికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తం మీద ఆల్ టైమ్ జాబితాలో 19వ స్థానం ద‌క్కించుకున్నాడు విరాట్‌. టెస్ట్‌ల‌లో 46.85 సగటుతో 9,230 పరుగులు, 30 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలతో కోహ్లి అత్యుత్తమ స్కోరు 254గా ఉంది.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...