Prajavani | ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
Prajavani | ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

అక్షరటుడే, ఇందూరు:Prajavani | ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ అంకిత్‌(Additional Collector Ankit) సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌(District Collectorate)లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 114 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ ఇన్‌ఛార్జి ఆర్డీవో స్రవంతి, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.