ePaper
More
    HomeతెలంగాణManala Mohan Reddy | పదేళ్ల అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా..: మానాల

    Manala Mohan Reddy | పదేళ్ల అభివృద్ధిపై చర్చించేందుకు సిద్ధమా..: మానాల

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Manala Mohan Reddy | ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) మాటలు రోజురోజుకూ మితిమీరుతున్నాయని, దమ్ముంటే బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధిపై చర్చించాలని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. వేల్పూర్​(Velpur)లో కనువిప్పు కార్యక్రమానికి వెళ్లేందుకు గురువారం ఆయన సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

    Manala Mohan Reddy | 18 నెలల్లో చేసి చూపించాం..

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్లలో అభివృద్ధిని తాము 18 నెలల్లో చేసి చూపించామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు బోనస్ ఇవ్వలేదని కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) చెల్లించామని గుర్తుచేశారు. 9 రోజుల్లో రూ.9వేల కోట్లు ఇచ్చామన్నారు. కేరళ మినహా ఎన్ఆర్ఐ సెల్​ను ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ (Telangana) అని స్పష్టం చేశారు. అలాగే గల్ఫ్ బాధితులకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా అందించామని, వేల్పూరులోనూ 18 మందికి అందించామన్నారు.

    READ ALSO  Mahalakshmi Scheme | రేపు నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్​లో సంబురాలు

    Manala Mohan Reddy | కేటీఆర్.. హరీష్ రావు మాటలు సరికాదు…

    బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) కాంగ్రెస్​పై చేస్తున్న వ్యాఖ్యలు సరికాని మోహన్ రెడ్డి(Manala Mohan Reddy) పేర్కొన్నారు. వారిని చూసి ప్రశాంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎంపై, ప్రభుత్వంపై అనవసరపు మాటలు మాట్లాడితే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

    Manala Mohan Reddy | మేం గాంధేయవాదులం..

    తాము పూర్తిగా గాంధేయ వాదులమని కేవలం కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై మాత్రమే మాట్లాడేందుకు వేల్పూర్​ వెళ్తానని మానాల పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు తమను అడ్డుకున్నారన్నారు. సమావేశంలో నాయకులు రోహిత్, పంచ రెడ్డి చరణ్, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    MLC Kavitha | అన్న‌య్య నీకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు.. క‌విత పోస్ట్ వైర‌ల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :MLC Kavitha | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)  పుట్టిన...

    Weather Updates | తెరిపినివ్వని వాన.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి వర్షం పడుతూనే ఉంది. రెండు రోజులుగా...

    Warangal NIT | వరంగల్‌ నిట్‌లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal NIT | వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో (National Institute of...

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    More like this