ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | బీఆర్‌ఎస్‌ వాళ్లు నా దారికి రావాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | బీఆర్‌ఎస్‌ వాళ్లు నా దారికి రావాల్సిందే.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీసీ రిజర్వేషన్లపై(BC Reservations) ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి ప్రభుత్వం కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం ఆ బిల్లులకు ఆమోదం తెలపకపోవడంతో ఆర్డినెన్స్​ ద్వారా స్థానిక ఎన్నికల్లో(Local Elections) 42శాతం రిజర్వేషన్​ తీసుకు వస్తామని ప్రభుత్వం తెలిపింది.

    ఆర్డినెన్స్​ను గవర్నర్​ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. అయితే బీఆర్​ఎస్​ నాయకులు ఆర్డినెన్స్​ను వ్యతిరేకిస్తున్నారు. దీనిపై తాజాగా ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) స్పందించారు. ఆమె బంజరాహిల్స్​లోని తన నివాసంలో మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆర్టినెన్స్‌ వద్దని చెప్పడం సరికాదన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్‌ తేవడం సరైందేనని ఆమె పేర్కొన్నారు. తాను న్యాయ నిపుణులతో చర్చించే ఆ మాటలు అంటున్నట్లు చెప్పారు. బీఆర్‌ఎస్‌ వాళ్లు కూడా తన దారికి రావాల్సిందేనని అన్నారు. అందుకు నాలుగు రోజులు టైం తీసుకుంటారేమోనని వ్యాఖ్యలు చేశారు.

    MLC Kavitha | వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..

    ఇటీవల కవితపై ఎమ్మెల్సీ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మల్లన్న వ్యాఖ్యలపై కేసీఆర్(KCR)​ కుటుంబం, బీఆర్​ఎస్​ పార్టీ(BRS Party) మౌనం వహించింది. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్​ నాయకులు(Congress Leaders), మంత్రులు ఖండించిన బీఆర్​ఎస్​ పార్టీ స్పందించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. తనపై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని.. దానిని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

    కాగా.. బీఆర్ఎస్​ నాయకులు వ్యతిరేకిస్తున్న బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్​(BC Reservations Ordinance)కు కవిత బహిరంగ మద్దతు తెలపడం గమనార్హం. న్యాయ నిపుణులతో చర్చించాకే తాను ఆర్డినెన్స్​కు మద్దుతు తెలుపుతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే బీఆర్​ఎస్​ మాత్రం ఆర్డినెన్స్​ ప్రభుత్వం బీసీలను మోసం చేయాలని చూస్తోందని ఆరోపిస్తోంది. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఒత్తిడి చేయాలని డిమాండ్​ చేస్తోంది. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...