ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​AIIMS Recruitment | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎయిమ్స్​లో భారీగా కొలువులు

    AIIMS Recruitment | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ఎయిమ్స్​లో భారీగా కొలువులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: AIIMS Recruitment | ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు ఎయిమ్స్​ శుభవార్త చెప్పింది. ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ మెడికల్ సైన్సెస్) 3,501 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్(Notification)​ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్​లలో పోస్టులను భర్తీ చేయనుంది. స్టెనోగ్రాఫర్(Stenographer), ఎంటీఎస్, యూడీసీ, గ్రూప్ బీ, సీ, టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్, హెల్త్ కేర్ పోస్టు(Health Care Post)ల భర్తీకి తాజాగా నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. https://rrp.aiimsexams.ac.in/advertisement/6871d99ae3045cd386f7b850 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    AIIMS Recruitment | పోస్టుల వివరాలు

    దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్​(AIIMS)లలో కొలువులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్టెనోగ్రాఫర్ పోస్టులు 221, అప్పర్ డివిజన్ క్లర్క్ 702, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ 371, ఫార్మసిస్ట్ గ్రేడ్ -2 పోస్టులు 38, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్(Medical Records Technician) 144 పోస్టులు, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్(Operation Theatre Assistant) / టెక్నీషియన్ 195, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 48 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు.

    AIIMS Recruitment | అర్హతలు

    ఆయా పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ, బీఎస్సీ, బీటెక్​, ఎమ్మెస్సీ, ఎంసీఏ చదివిన వారు ఆయా పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్​ ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే జనరల్​, ఓబీసీ అభ్యర్థులు రూ.3000, ఎస్సీ/ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,400 ఫీజు చెల్లించాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

    AIIMS Recruitment | పరీక్ష వివరాలు..

    ఎయిమ్స్​లో ఆయా పోస్టుల భర్తీ కోసం కంప్యూటర్​ బేస్​డ్​ టెస్ట్​(Computer Based Test) నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఆగస్టు 25, 26 తేదీల్లో ఉంటాయి. అనంతరం ఎంపికైన అభ్యర్థులకు స్కిల్​ టెస్ట్​ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్​ వెరిఫికేషన్​ అనంతరం ఉద్యోగం ఇస్తారు.

    More like this

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | జిల్లాలో బీఆర్​ఎస్ (Brs Nizamabad)​ పార్టీలో తొలి రాజీనామా నమోదైంది.  కేసీఆర్​...

    Nepal PM Resigns | నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM Resigns | నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలి తన పదవికి...

    Best Teacher Award | నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి

    అక్షరటుడే, ఇందూరు : Best Teacher Award | విద్యార్థులకు కేవలం మార్కులు, ర్యాంకుల చదువులు కాకుండా.. నైతిక...