ePaper
More
    HomeతెలంగాణWeather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    Weather Updates | రాష్ట్రానికి నేడు వర్ష సూచన

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. గత కొన్ని రోజులు వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంటలు సాగు చేసిన రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.

    దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం, సాయంత్రం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్​ నగరంలో చెదురుమదురు వానలు పడతాయి. రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్​ నగరంలో సైతం రాత్రి పూట భారీ వర్షం పడుతుంది. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది.

    Weather Updates | దంచికొట్టిన వాన

    యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ, వరంగల్​ రూరల్​, మహబూబాబాద్​, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా నాగారంలో 70మి.మీ, యాదాద్రిలోని రమ్మనపేటలో 51మి.మీ వర్షాపాతం నమోదైంది. వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...