ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    Special Train | తిరుపతి ప్రయాణికులకు గుడ్​న్యూస్.. అందుబాటులోకి ప్రత్యేక రైలు..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Special Train : తిరుమల Tirumala శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వేశాఖ ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తోంది. నాందేడ్ Nanded నుంచి తిరుపతి వరకు వారాంతపు ప్రత్యేక రైలు నడపబోతోంది. ఇది వయా నిజామాబాద్​ Nizamabad, పెద్దపల్లి Peddapalli మార్గంలో ప్రయాణించనుంది.

    Special Train : ఎప్పటి నుంచి అంటే..

    నాందేడ్​ తిరుపతి మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు వచ్చే నెల(ఆగస్టు 2 నుంచి ఆగస్టు 30 వరకు)లో అందుబాటులో ఉంటుంది. వారానికి ఒకసారి చొప్పున నెల రోజుల్లో ఐదుసార్లు అందుబాటులో ఉండనుంది.

    Special Train : ప్రయాణ వేళలు ఇలా…

    ఈ ప్రత్యేక రైలు ప్రతి శనివారం సాయంత్రం 4:50 నిమిషాలకు బయలుదేరి నాందేడ్​ నుంచి బయలుదేరుతుంది. బాసర Basara రైల్వే స్టేషన్​కు సాయంత్రం 6:23, నిజామాబాద్​ జంక్షన్​కు రాత్రి 7:23 గంటలకు చేరుకుంటుంది.

    READ ALSO  Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    నిజామాబాద్​ నుంచి బయలు దేరాక.. లింగంపేట జగిత్యాల Lingampet Jagtiala రైల్వే స్టేషన్​కు రాత్రి 8:38, కరీంనగర్ రైల్వే స్టేషన్​కు రాత్రి 9:38, పెద్దపల్లి జంక్షన్​కు 10:00 గంటలకు చేరుకుంటుంది.

    ఇక పెద్దపల్లి నుంచి 10:05 నిమిషాలకు బయలుదేరి, వరంగల్ Warangal ​కు రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.

    Special Train : తిరుగు ప్రయాణంలో..

    07016 తిరుపతి నుంచి నాందేడ్ ప్రత్యేక వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఆగష్టు -3 నుంచి ఆగష్టు – 31 వరకు 5 ట్రిప్ లు అందుబాటులో ఉంటాయి. ఇవి ప్రతి ఆదివారం సాయంత్రం 7:45 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరుతాయి. వరంగల్​కు మరుసటి రోజు ఉదయం 6:33 గంటలకు, పెద్దపల్లి జంక్షన్​కు 8:15 గంటలకు, కరీంనగర్ 9:08 గంటలకు, లింగంపేట జగిత్యాల 9:58 గంటలకు, నిజామాబాదు జంక్షన్ 11:28 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి బాసరకు మధ్యాహ్నం 12:03, నాందేడ్ రైల్వే స్టేషన్​కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది.

    READ ALSO  Mithun Reddy | మిథున్ రెడ్డికి జైల్లో కల్పించే సౌకర్యాలు ఇవేనా.. ప్రొటీన్ పౌడ‌ర్, టీవీతో పాటు..

    Latest articles

    Malnadu Drugs Case | నైజీరియన్​ డాన్​తో కలిసి డ్రగ్స్​ సరఫరా.. ‘మల్నాడు కేసు’లో కీలక విషయాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్(Malnadu Restaurant)​...

    Donald Trump | ట్రంప్‌కు అప్పీల్స్ కోర్టు షాక్‌.. జన్మతః పౌరసత్వంపై కీల‌క ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ త‌గిలింది. జన్మతః పౌరసత్వంపై ట్రంప్...

    Credit Cards | ఎస్​బీఐ, ఫోన్​పే క్రెడిట్​ కార్డులు.. ఆన్​లైన్​ కొనుగోళ్లపై భారీగా డిస్కౌంట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Credit Cards | ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రెడిట్​ కార్డుల వినియోగం పెరిగింది. అలాగే ఆన్​లైన్​...

    Local Body Elections | స్థానిక పోరుకు స‌న్న‌ద్ధం.. స‌న్నాహాక స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న పార్టీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | స్థానిక ఎన్నిక ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తోంది. హైకోర్టు ఆదేశాల...

    More like this