ePaper
More
    HomeతెలంగాణLocal Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన...

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో నగరా మోగనుంది. సెప్టెంబర్​ 30లోపు పంచాయతీ ఎన్నికలు (panchayat elections) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై ఆర్డినెన్స్​ను గవర్నర్​ ఆమోదానికి పంపిన సర్కారు​ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.

    Local Body Elections | త్వరలో ఎన్నికలు

    రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి సర్పంచులు లేక గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీల (MPTCs and ZPTCs) పదవీ కాలం ముగిసి కూడా ఏడాది దాటింది. మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతోంది.

    బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్​కు (BC reservation ordinance) గవర్నర్​ ఆమోదం తెలిపితే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఆ ఆర్డినెన్స్​ రాజ్​భవన్​కు చేరడంతో రెండు మూడు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    Local Body Elections | ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

    రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు వేగం పెంచింది. ఇందులో భాగంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను తాజాగా ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 జెడ్పీ చైర్​పర్సన్​లు, 566 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించింది. అలాగే 566 ఎంపీపీలు, 5773 ఎంపీటీసీలు ఉన్నట్లు వివరాలు వెల్లడించింది. నల్గొండలో అత్యధికంగా 33 మంది జెడ్పీటీసీలు, నిజామాబాద్​ 31 మంది జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

    అత్యధికంగా నల్గొండ జిల్లాలో (Nalgonda district) 353 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. 31 జిల్లా పరిషత్​లు ఉన్నాయి. హైదరాబాద్​, మేడ్చల్ – మల్కాజ్​గిరి జిల్లాల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేవు. ఆయా జిల్లాల్లోని ప్రాంతాలు మొత్తం మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షలు వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...