అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Manala Mohan Reddy | గల్ఫ్ బాధిత కుటుంబాల పట్ల మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) అసత్య ప్రచారం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, కార్పొరేషన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మాజీ మంత్రి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వేల్పూర్(Velpur)లో గురువారం కనువిప్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో గల్ఫ్ బాధిత కుటుంబాలను పట్టించుకోని ప్రశాంత్‌రెడ్డి, నేడు వారి సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లాలనే దురాలోచనతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Manala Mohan Reddy | ప్రభుత్వ పథకాలపై చర్చకు సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం (State Government) అమలు చేస్తున్న పథకాలపై చర్చించడానికి డీసీసీ అధ్యక్షుడిగా తనతో పాటు బాల్కొండ ఇన్‌ఛార్జి సునీల్ రెడ్డి(Balkonda Incharge Sunil Reddy), రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి(Chairmen Anvesh Reddy) కనువిప్పు కార్యక్రమానికి వస్తున్నామన్నారు. ప్రశాంత్‌రెడ్డికి నీతి ఉంటే వేల్పూరులో నిర్వహించే కార్యక్రమానికి రావాలని సవాల్ విసిరారు.