ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGovernor Jishnu Dev Varma | రాష్ట్రంలో తెలంగాణ వర్సిటీకి ప్రత్యేకస్థానం : గవర్నర్​

    Governor Jishnu Dev Varma | రాష్ట్రంలో తెలంగాణ వర్సిటీకి ప్రత్యేకస్థానం : గవర్నర్​

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Governor Jishnu Dev Varma | రాష్ట్రంలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ప్రత్యేకస్థానం ఉందని గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో (Telanagana University) బుధవారం రెండో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్​డీ, గోల్డ్​ మెడలిస్ట్​లకు పట్టాలను ప్రదానం చేశారు.

    అనంతరం గవర్నర్​ ప్రసంగిస్తూ.. తెలంగాణ యూనివర్సిటీ దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు విశ్వవిద్యాలయ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విశ్వవిద్యాలయం సాధించిన విజయాలు, విశేషమైన ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచాయని గవర్నర్​ స్పష్టం చేశారు.

    Governor Jishnu Dev Varma | 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై..

    2006లో ఆరు కోర్సులతో ప్రారంభమై నేడు ఏడు విభాగాల్లో 24 ఉప విభాగాలుగా అభివృద్ధి చెందిందన్నారు. 31 కోర్సులతో భిక్కనూరు(Bhiknoor), సారంగపూర్​ క్యాంపస్​లుగా (Sarangpur Campus) విస్తరించి వర్సిటీ విద్యనందిస్తోందన్నారు. గడిచిన 19 ఏళ్లలో ఇక్కడి అధికారులు అధ్యాపకులు, విద్యార్థుల కృషి మూలంగా యూనివర్సిటీ పేరు దశదిశలా పాకిందన్నారు.

    Governor Jishnu Dev Varma | స్నాతకోత్సవం ఎందరికో స్ఫూర్తి కావాలి..

    స్నాతకోత్సవం ఏర్పాట్లు చేయడమనేది కేవలం విద్యాపరమైన లక్ష్యసాధనలో విజేతలుగా నిలిచిన వారికోసమే కాదని.. వారిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు ఇదేబాటలో నడిచేందుకని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొఠారి కమిషన్ (Kothari Commission)​ చెప్పినట్లుగా దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే తీర్చిదిద్దబడుతుందనేది తెయూ నిరూపిస్తోందన్నారు.

    Governor Jishnu Dev Varma | అవకాశాల వైపు చూడాలి.. ఆందోళన వైపు కాదు..

    కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ (Indian Institute of Chemical Technology) మాజీ డైరెక్టర్ ఆచార్య శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికి ఆందోళనతో పాటు అవకాశాలు లభిస్తాయని.. ఆందోళన చెందకుండా అవకాశాల వైపు పరుగెత్తాలని సూచించారు.

    Governor Jishnu Dev Varma | ఇంజినీరింగ్​, ఫార్మసీ కళాశాలలకు కృషి..

    తెయూ వైస్​ ఛాన్స్​లర్​ యాదగిరిరావు(TU Vice Chancellor Yadagiri Rao) మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న కోర్సుల వివరాలతో పాటు కల్పిస్తున్న సౌకర్యాలను సమగ్రంగా తెలియజేశారు. వర్సిటీలో సమీప భవిష్యత్తులో ఇంజినీరింగ్ ఫార్మసీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

    Governor Jishnu Dev Varma | బాలికల హాస్టల్​, ఆడిటోరియం..

    పరిపాలనా భవనం 500 మంది విద్యార్థినుల కోసం హాస్టల్​ను, ఆడిటోరియం, క్రీడా మైదానం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని సూచించారు. ఈ స్నాతకోత్సవంలో 15 విభాగాల్లో 2014 నుంచి 2023 వరకు 132 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందించారు. 156 మంది పరిశోధకులకు డాక్టరేట్ పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్​ రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, రాకేశ్​రెడ్డి, డీన్స్ గంటా చంద్రశేఖర్, అపర్ణ, రాంబాబు, లావణ్య, శ్రీనివాసులు ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, హారతి, నాగరాజు, కనకయ్య, విద్యావర్ధిని, అరుణ, నాగరాజు పాత, పీఆర్వో పున్నయ్య తదితరులు పాల్గొన్నారు.

    స్నాతకోత్సవానికి హాజరైన ఎంపీ సురేష్​ రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్​పాల్​ సూర్యనారాయణ, రాకేష్​రెడ్డి

    Latest articles

    Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ...

    Cooking Oil | అధిక నూనె వాడకంపై యుద్ధం.. ప్రధాని మోదీ అలా ఎందుకు అన్నారు..?

    అక్షరటుడే, హైదరాబాద్: Cooking Oil | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వంట నూనె...

    GST Reforms | కొత్త జీఎస్టీ స్లాబ్​లు ఇవేనా.. కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM...

    Pulasa | వామ్మో.. కిలో చేపలు రూ.25 వేలా..!

    అక్షరటుడే, హైదరాబాద్: Pulasa | సాధారణంగా చేపలు చాలామందికి ఇష్టమే. కానీ, కొన్ని రకాల చేపలకు మాత్రం విపరీతమైన...

    More like this

    Cyberabad Police | తగ్గేదే లే అంటున్న మందుబాబులు.. ఎంత మంది చిక్కారంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cyberabad Police | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఏ...

    Cooking Oil | అధిక నూనె వాడకంపై యుద్ధం.. ప్రధాని మోదీ అలా ఎందుకు అన్నారు..?

    అక్షరటుడే, హైదరాబాద్: Cooking Oil | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వంట నూనె...

    GST Reforms | కొత్త జీఎస్టీ స్లాబ్​లు ఇవేనా.. కేంద్ర నిర్ణయంపై ఉత్కంఠ..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM...