ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | రెడ్​బుక్​ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు : వైఎస్​ జగన్​

    YS Jagan | రెడ్​బుక్​ రాజ్యాంగంతో రాష్ట్రంలో భయానక పరిస్థితులు : వైఎస్​ జగన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | రెడ్​బుక్​ రాజ్యాంగం(Red Book Constitution)తో రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్​ జగన్(YSRCP chief YS Jagan)​ అన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కార్యాలయం(Tadepalli Party Office)లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రాజ్యాంగం మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు.

    YS Jagan | వచ్చేది వైసీపీ ప్రభుత్వమే..

    ఇంకో మూడేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Naidu Government) పోతుందని జగన్​ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం చేయరని తెలిసి ఎవరూ కలవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగుతోందన్నారు. అధికారులను సైతం చంద్రబాబు వేధిస్తున్నారని.. తప్పుడు కేసులు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేత హారిక(YSRCP Leader Harika) గురించి టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

    YS Jagan | హామీలు అమలు చేయని బాబు

    ఏడాది పాలనలో చంద్రబాబు ఏ హామీని అమలు చేయలేని జగన్​ విమర్శించారు. విద్యార్థులకు వసతి దీవెన ఇవ్వలేదన్నారు. కరెంట్​ ఛార్జీలు(Current Charges) పెంచి ప్రజలపై ఏడాదిలో రూ.15 వేల కోట్ల భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

    YS Jagan | డీఐజీ మాఫియా డాన్

    ​రాష్ట్రంలో ఓ జోన్​ డీఐజీ మాఫీయా డాన్(DIG Mafia Don)​ అని జగన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ డీఎస్పీ, సీఐలు ఆయన ఆర్మీగా మారారన్నారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగే ఇసుక దందా, బెల్ట్​ షాపులు తదితర దందాల నుంచి వీరు డబ్బులు వసూలు చేసి డీఐజీకి ఇస్తారన్నారు. ఆ డీఐజీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు సగం డబ్బులు అందిస్తున్నట్లు జగన్​ ఆరోపించారు. మిగతా డబ్బులను పెద్దబాబు, చిన్నబాబులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డీఐజీలతో కలెక్షన్ల కార్యక్రమం(DIG Collections Program) నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...