అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | సమాజంలో నానాటికి నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. కారణం ఏదైనా మరొకరి ప్రాణాలు తీసేందుకు వెనుకాడడం లేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన హత్య కలకలం రేపుతోంది. బిచ్కుందలో ఓ యువకుడి దారుణంగా హతమార్చారు. మండల కేంద్రానికి చెందిన అడికె రమేష్‌ను దుండగులు బుధవారం తెల్లవారు జామున కత్తితో నరికి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రమేశ్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది.
