ePaper
More
    HomeసినిమాDevi Sri Prasad | దేవిశ్రీ ‘ఊ అంటావా’ పాట‌ను కాపీ కొట్టింది హాలీవుడ్ కాదు.....

    Devi Sri Prasad | దేవిశ్రీ ‘ఊ అంటావా’ పాట‌ను కాపీ కొట్టింది హాలీవుడ్ కాదు.. వీళ్లే.. సాంగ్ ఎలా ఉందో చూడండి..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Devi Sri Prasad | రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ టాలెంట్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. అయితే స్పెషల్ సాంగ్స్ చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) స్టయిల్ వేరు.

    ఆయన కంపోజ్ చేసిన ఎన్నో ట్యూన్స్ ట్రెండ్ క్రియేట్ చేయ‌డంతో పాటు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌(Music Lovers)కి పూన‌కాలు తెప్పించాయి. ఇటీవ‌ల కాలంలో పుష్ప సాంగ్ నుండి విడుద‌లైన ‘ఊ అంటావా? ఊ ఊ అంటావా?’ సాంగ్ ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సమంత స్టెప్పులు ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ సాంగ్‌ని విదేశీయులు కాపీ కొట్టారంటూ దేవిశ్రీ ప్ర‌సాద్ ఇటీవ‌ల అస‌హ‌నం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.

    ‘దిల్ రాజు డ్రీమ్స్’ (Dil Raju Dreams) అనే సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తన ప్రసంగంలో “ఐదే నిమిషాల్లో చెన్నైలో కూర్చొని కంపోజ్ చేసిన నా సాంగ్ ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ని ఎవరో విదేశీయులు కాపీ కొట్టారు. వాటిపై కేసు వేయాలా ఏం చేయాలా అనిపించింది… కానీ మన తెలుగు పాట అంత ప్రాచుర్యం పొందిందని గర్వంగా ఉంది,” అంటూ వ్యాఖ్యానించారు. దేవిశ్రీ కామెంట్స్ వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో అన్వేషణ మొదలైంది . “ఎవరు కాపీ కొట్టారు?” అని. ఈ పాటను 7 నెలల క్రితం టర్కిష్ సింగర్ (Turkish Singer) కాపీ చేసినట్లు గుర్తించారు. ఆమె పేరు అతియే.

    అతియే టర్కిష్ భాషలో ‘అన్లయినా’ (Unlaina) అనే టైటిల్‌తో ఓ ప్రైవేట్ సాంగ్ విడుదల చేశారు. ఆ మ్యూజిక్, బీట్, మూడ్ అన్నీ కూడా మన ‘ఊ అంటావా’ పాటకు సిమిల‌ర్‌గా ఉన్నాయి. సంగీతప్రియులు ఈ పాటను వింటే… ఇది మన ఊ అంటావా పాట‌కి కాపీ అనే భావ‌న క‌లుగ‌క మాన‌దు. ప్ర‌స్తుతం అతియే (Athiye) పాట‌కి మ‌న విజువ‌ల్స్ యాడ్ చేసి తెగ వైర‌ల్ చేస్తున్నారు. ఇక దీనికి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు పాటల ప్రభావం అంతర్జాతీయ స్థాయికి చేరిందంటే అది గర్వకారణమే అంటున్నారు. మరోవైపు “ఒరిజినల్ ఆర్టిస్ట్‌కు క్రెడిట్ ఇవ్వకుండా మ్యూజిక్ కాపీ కొట్టడం ఏమిటి?” అని ప్రశ్నిస్తున్నారు.

    More like this

    Powergrid Jobs | ‘పవర్‌గ్రిడ్‌’లో ఉద్యోగావకాశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Powergrid Jobs | ఫీల్డ్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ కోసం పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌...

    Edupayala | జలదిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం

    అక్షరటుడే, మెదక్ ​: Edupayala | జిల్లాలోని పాపన్నపేట మండలంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత...

    Big Boss Season 9 | బిగ్‌బాస్ సీజన్ 9 రేప‌టి నుండి మొద‌లు.. కామనర్స్ vs సెలబ్రిటీలు థీమ్‌తో ఆదివారం గ్రాండ్ స్టార్ట్!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Big Boss Season 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్...