ePaper
More
    Homeఅంతర్జాతీయంCDS Chauhan | పాక్ డ్రోన్ల‌తో ఎలాంటి న‌ష్టం జ‌రుగ‌లేదు.. వాటిని మ‌ధ్య‌లోనే నిర్వీర్యం చేశామ‌న్న...

    CDS Chauhan | పాక్ డ్రోన్ల‌తో ఎలాంటి న‌ష్టం జ‌రుగ‌లేదు.. వాటిని మ‌ధ్య‌లోనే నిర్వీర్యం చేశామ‌న్న సీడీఎస్ చౌహ‌న్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CDS Chauhan | ఆధునిక యుద్ధ రంగంలో మాన‌వ ర‌హిత విమానాలు (యూఏవీలు), డ్రోన్లు యుద్ధ రంగంలో కీల‌కంగా మారాయ‌ని, వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌ల‌లో ఇవి ప్రాధాన్యం సంత‌రించుకున్నాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్‌) అనిల్ చౌహాన్ అన్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ (Operation Sindoor) స‌మ‌యంలో పాకిస్తాన్ ప్ర‌యోగించిన‌ డ్రోన్ల వ‌ల్ల భార‌త్‌కు ఎలాంటి న‌ష్టం జ‌ర‌గలేద‌ని స్ప‌ష్టం చేశారు. పాక్ డ్రోన్ల‌ను మ‌ధ్య‌లోనే నిర్వీర్యం చేశామ‌ని చెప్పారు. బుధారం ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్, సెంటర్ ఫర్ జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్ నిర్వహించిన వర్క్‌షాప్ లో చౌహాన్(CDS Chauhan) ప్రసంగించారు.

    CDS Chauhan | విజ‌య‌వంతంగా అడ్డుకున్నాం..

    మే 10న జరిగిన ఆపరేషన్ సిందూర్ స‌మ‌యంలో పాకిస్తాన్(Pakistan) ఆయుధ రహిత డ్రోన్‌లను, మందుగుండు సామగ్రిని ప్ర‌యోగించిందని చౌహాన్ తెలిపారు. అయితే, అవి భార‌త్‌లోని సైనిక‌, స‌దుపాయాలకు కానీ, పౌరుల‌కు కానీ ఎలాంటి న‌ష్టం క‌లిగించ‌లేద‌న్నారు. వాటిని విజ‌య‌వంతంగా అడ్డుకున్నామ‌ని చెప్పారు. “మే 10న ఆపరేషన్ సిందూర్ సందర్భంగా, పాకిస్తాన్ నిరాయుధ డ్రోన్‌లను, సంచరిస్తున్న మందుగుండు సామగ్రిని ఉపయోగించింది. వాటిలో ఏవీ భారత సైనిక(Indian Army) లేదా పౌర మౌలిక సదుపాయాలకు ఎటువంటి నష్టం కలిగించలేదు. చాలా వాటిని తటస్థీకరించాం. వాటిలో కొన్నింటిని చెక్కు చెదరకుండా స్వాధీనం చేసుకున్నామ‌ని…” అని వివ‌రించారు.

    CDS Chauhan | యూఏవీల అభివృద్ధి అవ‌స‌రం..

    ర‌క్ష‌ణ రంగంలో కీల‌కంగా మారుతున్న వ్యూహాత్మ‌క మానవరహిత వైమానిక వాహనాల (UAV)తో పాటు స్వదేశీ కౌంటర్-డ్రోన్ టెక్నాల‌జీని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంద‌ని చౌహాన్ అన్నారు. “మనం డ్రోన్ల గురించి మాట్లాడేటప్పుడు, ఇవి ఏమిటని మీరు అనుకుంటున్నారు . అవి యుద్ధ రంగంలో పరిణామాత్మక మార్పును తీసుకువస్తున్నాయా లేదా విప్లవాత్మక మార్పును తీసుకువస్తున్నాయా? అంటే వాటి అభివృద్ధి పరిణామాత్మకమైనదని నేను చెబుతాను. ఆధునిక‌ యుద్ధంలో వాటి పాత్ర చాలా విప్లవాత్మకమైనది. వాటి విస్తరణ, పరిధి పెరిగినందున, సైన్యం డ్రోన్‌(Army Drone)లను విప్లవాత్మక రీతిలో ఉపయోగించడం ప్రారంభించిందని” పేర్కొన్నారు.

    CDS Chauhan | స్వదేశీ టెక్నాల‌జీయే కీల‌కం..

    సైన్యం చేప‌ట్టే కీల‌క‌మైన ఆప‌రేష‌న్ల‌లో స్వదేశీ టెక్నాల‌జీ ప్ర‌ధాన పాత్ర వ‌హిస్తోంద‌ని సీడీఎస్ తెలిపారు. విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకున్న టెక్నాల‌జీ వినియోగం వ‌ల్ల మ‌న సంసిద్ధ‌త బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని, అదే స్వ‌దేశీ టెక్నాల‌జీ (Indigenous Technology)వినియోగిస్తే మ‌రింత మేలైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్నారు. “మా మిషన్లకు కీలకమైన దిగుమతి చేసుకున్న నిచ్ టెక్‌పై ఆధారపడలేము.. విదేశీ టెక్నాలజీపై ఆధారపడటం సంసిద్ధతను బలహీనపరుస్తుంది” అని అన్నారు. యుద్ధంలో విస్తృత చారిత్రక మార్పును ఆయ‌న ప్రస్తావిస్తూ.. “అధునాత‌న ఆయుధాలు యుద్ధ పోరాట పరికరాలను చిన్నవిగా, వేగంగా, తేలికగా, మరింత సమర్థవంతంగా, మరింత సరసమైనవిగా చేశాయి. మా దగ్గర పెద్ద, బరువైన రైఫిల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి చిన్నవిగా, తేలికగా, ఎక్కువ రేంజ్‌లతో ఉన్నాయి. ట్యాంకులు, విమానాలకు కూడా ఇది వర్తిస్తుంది – అవి ఇప్పుడు తేలికైనవి, వేగంగా, ఎక్కువ రక్షణను అందిస్తాయి.” అని వివ‌రించారు.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...