అక్షరటుడే, నిజాంసాగర్: Kamareddy Collector | ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అధికారులను ఆదేశించారు. సోమవారం నిజాంసాగర్ (nijam sagar) మండలంలోని గోర్గల్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(paddy Center) ఆయన పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్లు అందజేయాలని అధికారులను సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెనువెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం, కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులు మాట్లాడుతూ లారీల కొరత ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ భిక్షపతి, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులున్నారు.