ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Job Notifications | పదో తరగతితో ఉద్యోగావకాశాలు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన డీఎస్‌ఎస్‌ఎస్‌బీ

    Job Notifications | పదో తరగతితో ఉద్యోగావకాశాలు.. నోటిఫికేషన్‌ విడుదల చేసిన డీఎస్‌ఎస్‌ఎస్‌బీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Job Notifications | ఢిల్లీ సబార్డినేట్‌ సర్వీసెస్‌ సెలెక్షన్‌ బోర్డు (DSSSB) వివిధ శాఖలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, స్థానిక సంస్థల్లో గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. 2,119 పోస్టుల(2119 Posts) భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీచింగ్, మెడికల్, టెక్నికల్ పోస్టులు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

    పోస్టులవారీగా వివరాలు..

    భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 2,119
    వార్డెన్(పురుషులు) : 1,676
    పీజీటీ ఇంగ్లిష్‌ (పురుషులు/మహిళలు) : 93
    మలేరియా ఇన్‌స్పెక్టర్ : 37
    డొమెస్టిక్‌ సైన్స్‌ టీచర్ : 26
    ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్ : 120
    టెక్నీషియన్ (ఒపిఎథ్) : 70
    ల్యాబ్‌ టెక్నిషియన్ : 30
    ఫార్మసిస్ట్ (ఆయుర్వేద) : 19
    సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్లు : 2

    విద్యార్హతలు: పోస్టును బట్టి పదో తరగతి(Tenth class), డిప్లొమా, డిగ్రీ(Degree), పీజీ, బీఈడీ/బీఏఈడీ/ఎంఈడీ వంటి విద్యార్హతలు అవసరం. సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం కూడా పరిశీలిస్తారు.

    వయో పరిమితి: పోస్టును బట్టి 18 ఏళ్ల నుంచి 32 ఏళ్లలోపువారు అర్హులు.

    వేతన వివరాలు :
    లెవల్ 2 ఉద్యోగాలకు రూ.19,900 నుంచి రూ.63,200.
    లెవల్ 8 ఉద్యోగాలకు రూ.47,600 – రూ.1,51,100.

    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
    దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 7.

    ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) నిర్వహిస్తారు. అవసరమైన పోస్టులకు ఫిజికల్/స్కిల్/ట్రేడ్ టెస్టులుంటాయి. దరఖాస్తు, పూర్తి వివరాలకు https://dsssb.delhi.gov.in వెబ్‌సైట్‌లో సం‍ప్రదించాలి.

    More like this

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...

    Bihar | ఎన్నికల ముందర బీహార్‌కు కేంద్రం వరాలు.. రూ.7,600 కోట్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Bihar | త్వరలో ఎన్నికలు జరుగున్న బీహార్ రాష్ట్రంపై కేంద్రం వరాల జల్లు కురిపించింది....