ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Adoption | దత్తత పేరుతో దుర్మార్గం.. బాలికపై కొన్నేళ్లుగా లైంగిక దాడి

    Adoption | దత్తత పేరుతో దుర్మార్గం.. బాలికపై కొన్నేళ్లుగా లైంగిక దాడి

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Adoption | మానవత్వం మంటగలిసిపోతోంది అనడానికి ఈ సంఘటనే ఉదాహణ. సమాజాన్ని కలచివేసేలా ఉన్న ఓ దారుణ ఘటన ఖమ్మం జిల్లా (Khammam district)లో వెలుగులోకి వచ్చింది. దత్తత పేరుతో ఓ బాలికను తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డ దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది.

    వివ‌రాల‌లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం, కృష్ణా జిల్లా(Krishna district) విస్సన్నపేటకు Visannapeta చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె (17)ను దత్తతగా తీసుకెళ్లేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన రమేశ్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు.

    అయితే, దత్తత పేరుతో తీసుకెళ్లిన ఆ బాలికపై రమేశ్ లైంగిక దాడులు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బాలిక రెండు సార్లు గర్భం దాల్చగా.. బలవంతంగా గర్భం తొలగించాడని బాధితురాలి తల్లి వాపోయారు.

    Adoption | మాన‌వ‌త్వానికే కళంకం..

    ఈ విషయం తెలిసిన వెంటనే బాధితురాలి పేరెంట్స్ విస్సన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తమ కుమార్తెను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, రమేశ్ మరోసారి బాలికను బలవంతంగా ఖమ్మం నగరానికి తీసుకెళ్లినట్లు సమాచారం. బాలిక తల్లి అందించిన సమాచారం ప్రకారం, ఖమ్మంలోని Khammam ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ వివాదాన్ని సర్దుబాటు చేయాలన్న యత్నం జరిగింది. కానీ తన కుమార్తెను తక్షణమే తమకు అప్పగించాలంటూ పేరెంట్స్ కోరారు. తరువాత, రమేశ్.. పోలీసు కానిస్టేబుల్ కృష్ణతో కలిసి బాలికను కారులో పంపించాలన్న ప్రయత్నంలో ఉన్నప్పుడు, బాలిక తల్లి ఆ కారును దారిలో అడ్డుకొని నిలదీశారు.

    అనంత‌రం ఆమె ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు Police కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పలువురి నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాలికను దత్తత పేరిట మోసం చేసి, లైంగిక దాడికి పాల్పడిన రమేశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు. ద‌త్తత వ్యవస్థను ఇలా దుర్వినియోగం చేయ‌డంపై పోలీసులు, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు మరింత జాగ్రత్తగా స్పందించాలని సమాజం కోరుతోంది.

    More like this

    Kerala Government | కేరళ ప్ర‌భుత్వం వినూత్న పథకం.. ఖాళీ ప్లాస్టిక్ మద్యం సీసాకు రూ. 20 వాపసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kerala Government | పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేరళ ప్రభుత్వం మరో కొత్త ప్రయోగానికి...

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...