అక్షరటుడే, ఆర్మూర్:Nandipet | ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండించిన రైతులు(Farmers) నష్టపోకుండా చూసే బాధ్యత అధికారులదేనని భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్ రెడ్డి(Nutala Srinivas Reddy) డిమాండ్ చేశారు. నందిపేట్(Nandipet) మండలంలోని బాద్గుణ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైపు గన్నీబ్యాగుల కొరత, తూకాలు ఆలస్యం అవుతుంటే.. మరో వైపు అకాల వర్షాలు రైతులను ముంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన నందిపేట్ మండలాధ్యక్షుడు రాజు, నాగ సురేష్, కంఠం, సాయికుమార్, కస్తూరి గంగాధర్, శివ, పద్మాకర్, రాజు, నవీన్ సుధాకర్ తదితరులున్నారు.