అక్షరటుడే, వెబ్డెస్క్: She Team | హైదరాబాద్ నగరంలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (bus stands and railway stations) వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం మహిళలను వేధిస్తున్నారు. గుంపులు ఉన్న చోట మహిళలను అసభ్యంగా తాకుతున్నారు. అంతేగాకుండా పండుగల సందర్భంగా సైతం వీరు రెచ్చిపోతున్నారు. నగరంలో కొనసాగుతున్న బోనాల పండుగలో (Bonalu festival) ఆకతాయిలు మహిళలో అసభ్యంగా ప్రవర్తించారు. అయితే షీ టీమ్ పోలీసులు వారి ఆట కట్టించారు.
She Team | 478 మందిని పట్టుకున్న షీ టీమ్
నగరంలో ఇటీవల జరిగిన బోనాలు, మొహర్రం పండుగ (Bonalu and Muharram festivals) సందర్భంగా పలువురు ఆకతాయిలు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. అయితే షీ టీమ్ పోలీసులు ముందుగానే ఇలాంటి వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో 478 మందిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీరిలో 386 మంది మేజర్లు కాగా.. 92 మంది మైనర్లు కూడా ఉండటం గమనార్హం. వీరిలో కొందరిని పోలీసులు హెచ్చరించి వదిలేశారు. మరికొందరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆరుగురిని కోర్టులో ప్రవేశ పెట్టగా.. ఐదుగురికి జరిమానా, ఒకరికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
She Team | 14 బృందాలతో..
పండుగల సందర్భంగా ఏటా ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. దీంతో షీ టీం అప్రమత్తం అయింది. హైదరాబాద్ నగరంలో (Hyderabad city) ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల పండుగలో వేల సంఖ్యలో పాల్గొంటారు. ఈ క్రమంలో షీ టీమ్ పోలీసులు (She Team police) ఆకతాయిల ఆట కట్టించడానికి 14 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఆయా ప్రాంతాల్లో నిఘా ఉంచి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాయి.