ePaper
More
    Homeబిజినెస్​Stock Market | బుల్స్‌కు బూస్ట్‌ ఇచ్చిన రిలయన్స్‌.. పరుగులు తీసిన సూచీలు

    Stock Market | బుల్స్‌కు బూస్ట్‌ ఇచ్చిన రిలయన్స్‌.. పరుగులు తీసిన సూచీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Stock Market | నాలుగో త్రైమాసికంలో రిలయన్స్‌(Reliance) ఇండస్ట్రీస్‌ మంచి ఫలితాలను సాధించడం, పీఎస్‌యూ, బ్యాంకింగ్‌ షేర్లు రాణిస్తుండడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్లు(Stock markets) భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం 131 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌.. ఇంట్రాడేలో గరిష్టంగా 1,109 పాయింట్లు(Points) లాభపడింది. నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడేలో గరిష్టంగా 316 పాయింట్లు పెరిగింది. ట్రేడింగ్‌(Trading) ముగిసే సమయానికి సెన్సెక్స్‌(Sensex) 1,005 పాయింట్ల లాభంతో 80,218 వద్ద, నిఫ్టీ 289 పాయింట్ల లాభంతో 24,328 వద్ద స్థిరపడ్డాయి.

    Stock Market | రాణించిన అన్ని రంగాలు..

    బీఎస్‌ఈ(BSE)లో ఐటీ ఇండెక్స్‌ మాత్రమే నష్టాలతో ముగిసింది. మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌(Mid cap index) 1.34 శాతం, లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.23 శాతం పెరిగాయి. ఎనర్జీ సెక్టార్‌ మూడు శాతానికిపైగా లాభపడగా.. పీఎస్‌యూ(PSU), పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌లు రెండు శాతానికిపైగా పెరిగాయి. మెటల్‌, ఆటో, రియాలిటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ కూడా రాణించాయి.

    బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో1,958 లాభాలతో, 2,038 నష్టాలతో ముగియగా.. 183 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి.

    75 కంపెనీలు 52 వారాల గరిష్టాలకు చేరగా.. 50 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్‌(Trade) అయ్యాయి. 5 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

    Stock Market | బుల్‌ రన్‌కు కారణాలు..

    ప్రధాన గ్లోబల్‌ మార్కెట్లలో హాంగ్‌కాంగ్‌(Hong Kong), చైనా, సింగపూర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు మినహా మిగతావాన్నీ పాజిటివ్‌గానే కొనసాగుతున్నాయి. రూపాయి విలువ 45 పైసలు బలపడి డాలర్‌కు 85కు చేరుకుంది. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌(Dollar index) మరింత బలహీనపడింది. బంగారంతోపాటు క్రూడ్‌ ఆయిల్‌ ధర కూడా తగ్గుతోంది. అమెరికా, చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలు ఉండడం, క్యూ4లో రిలయన్స్‌ మంచి ఫలితాలను సాధించడం, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో బుల్స్‌(Bulls) జోరు కొనసాగుతుండడంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌లోని ప్రధాన సూచీలలో కొనుగోళ్ల మద్దతు లభించింది.

    Stock Market | Top Gainers..

    బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 30 ఇండెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో ముగియగా 7 కంపెనీలు మాత్రం నష్టాలతో ముగిశాయి. రిలయన్స్‌ 5 శాతానికిపైగా పెరిగి నిఫ్టీ(Nifty), సెన్సెక్స్‌లలో భారీ ర్యాలీకి కారణమైంది. సన్‌ ఫార్మా 2.97 శాతం పెరగ్గా.. టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌(Tata motors) రెండు శాతానికిపైగా లాభపడ్డాయి.

    Stock Market | Top Losers..

    హెచ్‌సీఎల్‌ టెక్‌(HCL Tech) 1.91 శాతం పడిపోయింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే, హెచ్‌యూఎల్‌, ఎటర్నల్‌ నష్టపోయాయి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...