అక్షరటుడే, బోధన్: Basti dawakana | పట్టణానికి రెండు బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయి. ఈ మేరకు ఒక దవాఖానాను శక్కర్‌నగర్‌లో గతంలోనే ఏర్పాటు చేశారు. మరో దవాఖానా కోసం మంగళవారం బోధన్ సబ్‌కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) స్థలపరిశీలన చేశారు.
Basti dawakana | బ్రాహ్మణగల్లిలో..
ముందుగా గంజి ప్రాంతంలోని కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు. అక్కడ స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అనంతరం బ్రాహ్మణగల్లీలోని (Brahmangalli) గ్రామచావడిని తనిఖీ చేశారు. ఆ ప్రాంతం బస్తీ దవాఖానా ఏర్పాటుకు అనువుగా ఉందని భావిస్తూ.. ఏర్పాట్లకు ప్రతిపాదనాలు పంపాలని డీఎంహెచ్‌వోకు (DMHO) పంపాలని సూచించారు.
కాలనీల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే జీజీహెచ్ (GGH Bodhan)కు వెళ్లాల్సి వస్తోంది. ఇది ఎంతో ప్రయాసతో కూడుకున్నది కావడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ కృష్ణజాదవ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో స్రవంతి కూడా ఉన్నారు.