ePaper
More
    HomeతెలంగాణRohith Vemula | రోహిత్​ వేముల ఆత్మహత్యపై వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎంకు నోటీసులు పంపిన బీజేపీ...

    Rohith Vemula | రోహిత్​ వేముల ఆత్మహత్యపై వ్యాఖ్యలు.. డిప్యూటీ సీఎంకు నోటీసులు పంపిన బీజేపీ అధ్యక్షుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rohith Vemula | రాష్ట్రంలో 8 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన రోహిత్​ వేముల ఆత్మహత్య ప్రస్తుతం రాజకీయ దుమారం రేపుతోంది. హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ విద్యార్థి (Hyderabad Central University Student) రోహిత్​ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

    అయితే రోహిత్​ ఆత్మహత్యకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇటీవల నియామకం అయిన రామచందర్​రావే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రాంచందర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా డిప్యూటీ సీఎంకు లీగల్​ నోటీసులు పంపారు. రోహిత్‌ వేముల ఆత్మహత్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని.. లేదంటే రూ.25 లక్షల పరువు నష్టం దావా వేస్తానన్నారు.

    READ ALSO  MLA Sri Ganesh | ఎమ్మెల్యే శ్రీ గణేశ్​పై దాడికి యత్నం.. బోనాల సందర్భంగా ఘటన..!

    Rohith Vemula | భట్టి ఏమన్నారంటే..

    రాష్ట్రంలో రోహిత్​ వేముల (Rohith Vemula) ఆత్మహత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయనను యూనివర్సిటీ సస్పెండ్​ చేయడంతో 2016 జనవరి 7న ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ (Union Minister Bandaru Dattatreya) మానవవనరుల శాఖ మంత్రికి లేఖ రాయడంతోనే రోహిత్​ ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆరోపించాయి.

    ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు జరిగాయి. ఇటీవల దీనిపై మాట్లాడుతూ భట్టి విక్రమార్క రోహిత్​ ఆత్మహత్యకు రామచందర్‌రావే (Ramachandra Rao) కారణమని ఆరోపించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తొలగించాలని డిమాండ్​ చేశారు. అణగారిన వర్గాల విద్యార్థిని వేధించి ఆత్మహత్యకు ఉసిగొల్పిన వ్యక్తికి పదవి కట్టాబెట్టారన్నారు.

    Rohith Vemula | రోహిత్​ వేముల చట్టం తెస్తాం..

    గతంలో కేసీఆర్​ ప్రభుత్వం (KCR Government) రోహిత్ వేముల ఆత్మహత్య గురించి పట్టించుకోలేదని భట్టి అన్నారు. తమ ప్రభుత్వం ఈ కేసుపై సమగ్రంగా విచారణ జరుపుతుందన్నారు. విచారణ ప్రక్రియను పున: ప్రారంభిస్తామని చెప్పారు. మళ్లీ ఏ దళిత, ఆదివాసీ విద్యార్థికి ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా రాష్ట్రంలో రోహిత్​ వేముల చట్టం తీసుకు వస్తామని భట్టి విక్రమార్క అన్నారు.

    READ ALSO  Railway Line | ఎంపీ చొరవతో ఆర్మూరు మీదుగా పటాన్​చెరు‌‌ – ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ మంజూరు

    Latest articles

    Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Accident | ఒడిశాలో రైలు ప్రమాదం(Train Accident Odisha) చోటు చేసుకుంది. సంబల్‌పూర్‌లోని...

    Hari Hara Veeramallu | ట్రెండింగ్‌లో డిజాస్ట‌ర్ హరిహ‌ర వీర‌మ‌ల్లు…సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ వార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hari Hara Veeramallu | దాదాపు రెండేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan)  న‌టించిన...

    BSF Notification | బీఎస్ఎఫ్‌లో భారీ ఉద్యోగాలు.. 3588 పోస్ట్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: BSF Notification | నిరుద్యోగ యువతకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) శుభవార్త అందించింది....

    Fake Votes | న‌కిలీ ఓట్లు వేయ‌డానికి అనుమ‌తించాలా? ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై సీఈసీ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Fake Votes | బీహార్ ఎన్నిక‌ల ముంద‌ర చేప‌ట్టిన ఓటార్ జాబితాల స్పెష‌ల్ ఇంటెన్సివ్...

    More like this