ePaper
More
    HomeతెలంగాణPeddapalli District | ఇద్దరిని బలిగొన్న పంచాయితీ.. భార్యభర్తల గొడవపై చర్చిస్తుండగా ఘర్షణ..

    Peddapalli District | ఇద్దరిని బలిగొన్న పంచాయితీ.. భార్యభర్తల గొడవపై చర్చిస్తుండగా ఘర్షణ..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Peddapalli District | భార్యభర్తల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు నిర్వహించిన పంచాయితీ అదుపు తప్పింది. మాట మాట పెరిగి దాడికి దారి తీసింది. రెచ్చిపోయి కత్తులతో దాడి చేసుకోవడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం(Sultanabad Mandal) సుగ్లాంపల్లిలో మంగళవారం ఈ దారుణం చోటు చేసుకుంది.

    Peddapalli District | చర్చలకు వచ్చి..

    పెద్దపల్లి (Peddapalli) మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయికి, ఓదెల మండలానికి చెందిన అబ్బాయికి గతంలో వివాహం జరిగింది. అయితే, దంపతుల మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ వ్యవహారం పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఇరువైపులా వారు మంగళవారం సుగ్లాంపల్లి గ్రామం (Suglampally Village)లో పంచాయితీ పెట్టారు. చర్చలు జరుగుతుండగానే వాగ్వాదం మొదలైంది.

    Peddapalli District | సుపారీ ఇచ్చి దాడి..

    పంచాయితీ జరుగుతుండగా ఇరువైపులా వారు అదుపు తప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు మాట మాట అనుకున్నారు. ఈ వాగ్వాదం కాస్త పెరిగి పూర్తిగా అదుపు తప్పింది. ఇరువర్గాల మధ్య ఘర్షణ అదుపు తప్పింది. అమ్మాయి తరఫు వారు కత్తులతో దాడికి దిగారు. ఈ ఘర్షణలో కత్తిపోట్లకు గురైన తీవ్ర రక్తస్రావంతో మల్లేశ్, గణేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మోటం మధునయ్యకు తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉంది. మోటం సారయ్య తలకు గాయాలు మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని అత్యవసరంగా సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ ఆసుపత్రి (Karimnagar Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య తరఫు వారు సుపారీ ముఠాను తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడిందని భర్త తరఫు వారు ఆరోపించారు. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    Latest articles

    BC Sankshema Sangham | బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud)...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా.. ప్రయత్నాలు ప్రారంభించిన ఎన్డీఏ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార ఎన్డీఏ కూటమి భావిస్తోంది. జగదీప్​...

    Raktha Veera Award | రేపు జాతీయ రక్త వీర అవార్డు అందుకోనున్న వెంకటరమణ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Raktha Veera Award | రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి సేవ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు...

    Rahul Sipligunj | సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్.. అమ్మాయి ఎవ‌రంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Sipligunj | ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు అందుకున్న...

    More like this