ePaper
More
    HomeతెలంగాణTelangana University | తెయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

    Telangana University | తెయూ స్నాతకోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | తెలంగాణ విశ్వ విద్యాలయంలో నిర్వహించే రెండో స్నాతకోత్సవ కార్యక్రమానికి (Graduation ceremony) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వర్సిటీ వీసీ యాదగిరి రావు (University VC Yadagiri Rao) తెలిపారు. కార్యక్రమానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో మంగళవారం వర్సిటీ ఆవరణలో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు.

    Telangana University | తనిఖీలను పర్యవేక్షించిన సీపీ

    స్నాతకోత్సవానికి గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ, ఆయా యూనివర్సిటీల డీన్లు వస్తుండడంతో ప్రాంగణాన్ని స్నిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం (Sniffer Dog Squad), బాంబు డిస్పోజల్ టీం(Bomb disposal team) అధికారులు నిషితంగా పరిశీలించారు. తనిఖీలను సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) పర్యవేక్షించారు. అనంతరం ఏడో బెటాలియన్​ (Seventh Battalion) గాడ్​ ఆఫ్​ ఆనర్​ టీం, బ్యాండ్​ టీం ఆర్​ఎస్​ఐ కొమ్ము శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్స్​లర్​ యాదగిరిరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.

    Telangana University | మాక్​డ్రిల్​ పూర్తి..

    వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్​తో కలిసి మాక్​ సెషన్ నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ కమిటీల కన్వీనర్లు గంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, హారతి, రాంబాబు, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల నాగరాజు, పీఆర్వో పున్నయ్యతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...