అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నుంచి మంగళవారం సాయంత్రం 1,200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ (Irrigation Department) ఏఈఈలు సాకేత్, శివప్రసాద్ తెలిపారు.
Nizamsagar project | పదిరోజుల పాటు..
నిజాంసాగర్ (Nizamsagar project) జలాశయం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం (Hydroelectric power plant) సమీపంలోని ప్రధాన గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. పది రోజులపాటు నీటి విడుదల కొనసాగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిజాంసాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులకు (17.80 టీఎంసీలు) గాను 1,391.46 అడుగులు (4.703 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు. ఆయకట్టు రైతుల అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలలో హెచ్చుతగ్గులు ఉంటాయని పేర్కొన్నారు.