ePaper
More
    HomeతెలంగాణACB Raids | కాళేశ్వరంలో అవినీతి తిమింగలాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన పలువురు అధికారులు

    ACB Raids | కాళేశ్వరంలో అవినీతి తిమింగలాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన పలువురు అధికారులు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids | కాళేశ్వరం ప్రాజెక్ట్​లో చేపలు ఉండాలి.. కానీ ఇక్కడ తిమింగలాలు ఉన్నాయి. అవి మాములు తిమింగలాలు కూడా కాడు… భారీ అక్రమాలకు పాల్పడిన అవినీతి తిమింగలాలు. కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)​ పేరిట భారీగా ప్రజాధనాన్ని దోచేశారని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్​ కుటుంబం కోసమే దీనిని నిర్మించారని కాంగ్రెస్​, బీజేపీ నాయకులు (BJP Leaders) ఆరోపిస్తున్నారు. రూ.లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్ట్​తో ఉపయోగం లేదని.. సీఎం రేవంత్ రెడ్డి సైతం పలుమార్లు వ్యాఖ్యానించారు.

    ఈ క్రమంలో కాళేశ్వరంపై విచారణకు ప్రభుత్వం కమిషన్​ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్​ ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former Chief Minister KCR)​, మాజీ మంత్రులు హరీశ్​రావు(Former Ministers Harish Rao), ఈటల రాజేందర్​ను విచారించింది. అయితే ఈ ప్రాజెక్ట్​లో కీలకంగా వ్యహరించిన పలువురు అధికారులు భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు(ACB Officers) వీరి పని పడుతున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్​లో ఈఈ పని చేసిన నూనె శ్రీధర్​ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. తాజాగా మాజీ ఈఎన్​సీ మురళీధర్​రావును అదుపులోకి తీసుకుంది.

    ACB Raids | ఏకకాలంలో సోదాలు

    మురళీధర్​రావు ఇరిగేష‌న్ ఇంజినీర్ ఇన్ చీఫ్​గా పని చేశారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలోనే భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు సమాచారం. దీంతో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు మంగళవారం మురళీధర్​రావు(Muralidhar Rao) ఇంటితో పాటు 10 చోట్ల ఏకకాలంలో దాడులు చేశారు. ఈ క్రమంలో భారీగా అక్రమాస్తులు గుర్తించినట్లు సమాచారం. మురళీధర్​ రావును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపడుతున్నారు.

    ACB Raids | గతంలో నూనె శ్రీధర్​

    కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(Executive Engineer)​గా పని చేసిన నూనె శ్రీధర్​ (Nune Sridhar)ను గతంలో ఏసీబీ అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. జూన్​ 11న ఆయన ఇంటితో పాటు బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన అవినీతి బాగోతాన్ని చూసిన ఏసీబీ అధికారులే షాక్​ అయ్యారు. ఒక ఈఈ రూ.500 కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టారు. దీంతో కాళేశ్వరంలో ఏ స్థాయిలో అవినీతి జరిగిందో ఊహించుకోవచ్చు.

    ACB Raids | 13 ఏళ్ల పాటు పదవీకాలం పొడిగింపు

    ఓ అధికారి పదవీ కాలాన్ని అవసరాన్ని బట్టి రెండేళ్లు, మూడేళ్లు పొడిగించడం చూస్తుంటాం. అయితే గతంలో ఈఎన్​సీగా పని చేసిన మురళీధర్​రావు పదవీకాలాన్ని మాత్రం 13 ఏళ్లపాటు పొడిగించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో ఈఎన్​సీ జనరల్​గా వ్యవహరించిన మురళీధర్​రావు అప్పుడే రిటైర్డ్​ అయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీ కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు.

    కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక కూడా ఆయన కొద్ది రోజులు పని చేశారు. మేడిగడ్డపై విజిలెన్స్​ నివేదిక(Vigilance Report) అనంతరం ఆయనను ప్రభుత్వం తొలగించింది. తాజాగా అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్​లో ఆయన భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...