అక్షరటుడే, ఇందూరు: Governor Jishnu Dev Verma | రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈనెల 16న జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. ముందుగా హైదరాబాద్ (Hyderabad) నుంచి డిచ్పల్లి 7వ పోలీస్ బెటాలియన్‌కు చేరుకుంటారు.
Governor Jishnu Dev Verma | తెలంగాణ యూనివర్సిటీలో..
అక్కడి నుంచి తెలంగాణ విశ్వవిద్యాలయంలో (Telangana University) జరిగే రెండవ స్నాతకోత్సవ (Graduation ceremony) కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజన అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడ జిల్లా అధికారులు, కవులు, కళాకారులు, జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలతో ముచ్చటిస్తారు. అనంతరం జిల్లా టీబీ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ(Red Cross Society) ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు.