ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిConocarpus Trees | కోనోకార్పస్ చెట్లను తొలగించాలి

    Conocarpus Trees | కోనోకార్పస్ చెట్లను తొలగించాలి

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Conocarpus trees | పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో కోనోకార్పస్​ చెట్లను తొలగించాలని పట్టణవాసులు కోరుతున్నారు. చెట్లను తొలగించాలని కోరుతూ మంగళవారం రెవెన్యూ అధికారి శ్రీనివాస్​కు (Revenue Officer Srinivas) వినతిపత్రం అందజేశారు.

    Conocarpus trees | చెట్లతో శ్వాసకోస ఇబ్బందులు..

    కొనొకార్పస్ చెట్లతో ఎన్నో అనర్ధాలు ఉన్నాయని, శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పట్టణంలోని ప్రతి వీధిలో ఈ మొక్కలు నాటడంతో ప్రస్తుతం వృక్షాలుగా మారాయని అన్నారు. ఎన్నో అనర్ధాలు ఉన్న ఇలాంటి చెట్లను తొలగిస్తే మేలు జరుగుతుందన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో పతంజలి రఘువీర్, గాజుల రాజులు, ప్రీతం రెడ్డి ఉన్నారు.

    Conocarpus trees | వేలల్లో మొక్కలు నాటారు..

    రాష్ట్రవ్యాప్తంగా చెట్లునాటే కార్యక్రమంలో భాగంగా కోనోకార్పస్​ మొక్కలను (Conocarpus plants) రహదారులకు ఇరువైపులా నాటారు. పట్టణాల నుంచి పల్లెల వరకు ప్రతి రహదారికి ఇరువైపులా వీటిని నాటడంతో ప్రస్తుతం ఏపుగా మారాయి. అయితే ఈ చెట్లనుంచి వచ్చే పుప్పొడి కారణంగా అలర్జీలు వస్తుంటాయని పర్యావరణ శాస్త్రవేత్తలు (Environmental scientists) చెబుతున్నారు. వీటి పుప్పొడి కారణంగా తీవ్రమైన జలుబు, ఆస్తమా వంటి సమస్యలు వస్తుంటాయని పేర్కొంటున్నారు. తరచూ ముక్కు నుంచి నీళ్లు కారడం, తుమ్ములు, కళ్ల నుంచి నీరు రావడం జరుగుతుందని అంటున్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...