ePaper
More
    HomeFeaturesDangerous Wives | కట్టుకున్నోడినే కాటికి పంపుతున్నారు.. ఐదేళ్లలో సుమారు 800 మంది భర్తల హత్యలు..

    Dangerous Wives | కట్టుకున్నోడినే కాటికి పంపుతున్నారు.. ఐదేళ్లలో సుమారు 800 మంది భర్తల హత్యలు..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Dangerous Wives | యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య హత్య చేసింది. కాటేపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో స్వామిని ఆమె భార్య ప్రియుడు కారుతో ఢీకొట్టి చంపాడు. అలాగే ఓ బ్యాంకు ఉద్యోగి తల్లీబిడ్డలతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. ఈ క్రమంలో కూతురుకు పెళ్లి అయ్యాక, ఆమె భర్తను తల్లీబిడ్డలతో కలిసి కడతేర్చాడు. ఉత్తర్​ప్రదేశ్​లోని బులంద్‌షహర్‌​ జిల్లాలో.. భర్త ఎదుటే తన ప్రియుడితో లైంగికంగా పాల్గొనడంతో తట్టుకోలేక మొగుడు సూసైడ్​ చేసుకున్నాడు.

    ఇటీవల కొందరు భార్యలు ప్రియుడి మోజులో పడి ఉన్మాదులుగా మారుతున్నారు. తమ భర్తలను కర్కశంగా కడతేర్చుతున్నారు. భవిష్యత్తుపై ఎన్నో గొప్ప కలలతో వరుడు తన ఇంటికి భార్యను తెచ్చుకుంటే.. కట్టుకున్న వాడిని కాటికి పంపుతున్నారు. భర్త తన సొంతింట్లోనే డ్రమ్​లో నిర్జీవిగా మారడం చూస్తున్నాం. లేదంటే హనీమూన్ (Honeymoon)​ ట్రిప్​లో పర్వత ప్రాంతాల్లో దారుణ హత్యకు గురికావడం, కారుతో ఢీ కొట్టి చంపించేయడం, భర్త ఎదుటే ప్రియుడితో భార్య చేస్తున్న శృంగార కార్యాన్ని చూసి తట్టుకోలేక బలవన్మరణం చెందాల్సిన దుస్థితి కొనసాగుతోంది.

    మీరట్‌కు చెందిన ముస్కాన్, ఇండోర్‌కు చెందిన సోనమ్.. ఇలా భార్యలు ఎవరైనా.. తమ భర్తలను చంపడం వెనుక ఉన్న ఏకైక కారణం ‘ప్రేమ’ అని వారు చెప్పుకొనే కామం. కొందరు పెళ్లికి ముందే వివాహేతర సంబంధం కలిగి ఉన్నారు.. కొందరు పెళ్లి అయ్యాక వివాహేతర సంబంధం నెరిపినవారు.. ఏదైతేనేం మొత్తానికి భర్తలను బలి చేస్తున్నారు.

    Dangerous Wives | ఏటా కేసుల నమోదు..

    భార్య ప్రియుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న భర్తల సంఖ్య లెక్క పెద్దగానే ఉంది. ఇటీవల ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీని ప్రకారం.. భారత్​లో ఏటా 275 మంది భర్తలు హత్య చేయబడుతున్నారు. కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఐదేళ్లలో 785 భర్తల హత్య కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆ ఐదు రాష్ట్రాలు ఏవంటే.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్ర.

    Dangerous Wives | ప్రతి పది హత్య కేసుల్లో..

    దేశంలో జరిగే ప్రతి 10 హత్యలలో ఒకటి భర్త లేదా భార్య లేదా ప్రేమికుడి వల్ల జరుగుతున్నాయట. 2010 నుంచి 2014 వరకు, ప్రేమ వ్యవహారాలు, సంబంధాలకు సంబంధించిన హత్యల నిష్పత్తి 7% , 8% మధ్య ఉంది. 2015 నుంచి 2022 వరకు.. ఈ శాతం 10 -11 శాతం మధ్య నమోదు అయింది. అంటే ఇలాంటి నేరాలు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది.

    Dangerous Wives | అత్యధికంగా ఈ రాష్ట్రాల్లోనే..

    ఉత్తరప్రదేశ్(UP) ఎక్కువ మంది భార్యలు తమ భర్తలను చంపుతున్న రాష్ట్రంగా నిలిచింది. పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం కారణంగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఐదు సంవత్సరాల డేటాను పరిశీలిస్తే 275 మంది భర్తలు హత్యకు గురయ్యారు.

    భర్తల హత్య కేసుల్లో బీహార్ (Bihar) రెండో స్థానంలో ఉంది. ఇక్కడ భర్తలు భార్యల చేతుల్లో హతమవుతున్నారు. బీహార్ భార్యలు కూడా ఇప్పుడు భయపెడుతున్నారు. గత ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో 186 మంది భర్తలు చంపబడ్డారు. రాజస్థాన్‌లోనూ భార్యల ఆటలు మామూలుగా ఉండటం లేదు. గత ఐదేళ్లలో 138 మంది భర్తలను కడతేర్చారు. ఈ ఘటనలు ఇక్కడి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నాయి.

    పతుల హత్యల్లో మహారాష్ట్ర నాలుగో స్థానంలో ఉంది. గత ఐదేళ్లలో మహారాష్ట్రలో ఇలాంటి 100 కేసులు వెలుగులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు ప్రధానంగా వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సతులు తమ పతులను చంపిన 87 కేసులు వెలుగులోకి వచ్చాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...