అక్షరటుడే, హైదరాబాద్: Malnadu drug case : కోంపల్లిలో జరిగిన మల్నాడు డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పురోగతి చోటుచేసుకుంది. సైబరాబాద్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో ఎస్ఐబీ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజ పాత్ర ఉంది. డిచ్పల్లి కొకైన్ కేసులోనూ రాహుల్ తేజ నిందితుడిగా ఉన్నాడు. ఇతడితోపాటు సైబరాబాద్ ఏఆర్ డీసీపీ సంజీవ్ కుమారుడు మోహన్ కూడా మల్నాడు డ్రగ్స్ కేసులో ఉండటంతో ఈగల్ టీం ఇద్దరిని అరెస్టు చేసింది.
డ్రగ్స్ సరఫరా చేస్తున్న నెట్వర్క్ను ఈగల్ టీం ఛేదించే పనిలో పడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన హర్ష, సూర్య సహా ఎనిమిది మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. తాజాగా మరికొందరిని అరెస్టు చేసింది.
Malnadu drug case : నిజామాబాద్ కొకైన్ కేసులోనూ నిందితుడు..
నిజామాబాద్ Nizamabad లోనూ గత నెల నమోదైన డ్రగ్స్ కేసులో రాహుల్ తేజ సూత్రధారిగా ఉన్నాడు. అతడి కోసం డిచ్పల్లి పోలీసులు ఇప్పటికే పీటీ వారెంట్ PT జారీ చేశారు.
మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్ తేజను ఈగల్ టీం అరెస్టు చేసింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో కలిసి రాహుల్ డ్రగ్స్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాహుల్, సూర్య, హర్ష కలిసి మత్తు పదార్థాల వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు.
Malnadu drug case : ఎవరీ సూర్య..
హైదరాబాద్ శివారులో ఉన్న రిసార్టులో సూర్య వీకెండ్లకు డ్రగ్ పార్టీలు నిర్వహించేవాడని తెలిసింది. మల్నాడు రెస్టారెంట్లోనూ డ్రగ్స్ సరఫరా చేసేవాడని తేలింది. ఫుడ్ బ్లాగర్ గా ప్రసిద్ధి పొందిన guise లో పబ్లలోని ఫుడ్ ల గురించి ప్రచారం చేసేవాడు సూర్య. అయితే అదే ముసుగులో రహస్యంగా తన డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
Malnadu drug case : హర్ష పాత్ర ఏంటంటే..
ఇక హర్ష ది కూడా ఈ కేసులో కీలక పాత్రధారిగా ఉన్నాడు. పుణె, ముంబయి, గోవా వంటి నగరాల నుంచి డ్రగ్స్ తెచ్చి, సూర్యకు సరఫరా చేసేవాడు. గ్రేటర్ హైదరాబాద్లో డ్రగ్ పార్టీలు నిర్వహించడంలో హర్ష ప్రధాన సూత్రధారి.
Malnadu drug case : ఎనిమిది పబ్లు..
తాజా డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దర్యాప్తు ముమ్మరం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎనిమిది పబ్ యజమాన్యాలు డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తోంది. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది. త్వరలోనే మరి కొన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది.