ePaper
More
    HomeతెలంగాణBhoodan lands | భూదాన్​ భూముల వ్యవహారం.. ఆ ఐఏఎస్, ఐపీఎస్​లకు షాక్​.. రంగంలోకి ఈడీ..!

    Bhoodan lands | భూదాన్​ భూముల వ్యవహారం.. ఆ ఐఏఎస్, ఐపీఎస్​లకు షాక్​.. రంగంలోకి ఈడీ..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhoodan lands | భూదాన్​ భూముల bhoodan lands telangana వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం rangareddy district maheswaram mandal మండలం నాగారం గ్రామంలోని భూదాన్‌ భూములు అన్యాక్రాంతం అయిన విషయం తెలిసిందే.

    కాగా.. ఇందులో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు bhoodan lands telangana ias, ips list సహా ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దీనిపై హైకోర్టులో High court telangana విచారణ సాగుతోంది. కాగా.. తాజాగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ)ED ఎంటర్​ అయ్యింది. వందల ఎకరాల భూములను విక్రయించిన పలువురు ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. సోమవారం హైదరాబాద్​లోని పాతబస్తీలో గల పలువురి ఇళ్లలో అధికారులు సోదాలు చేపట్టారు.

    Bhoodan lands | పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​ల పాత్ర!

    రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నం.181, 182, 194, 195లో ‘భూదాన్‌’ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైన విషయం తెలిసిందే. ఇందులో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు సహా కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందని పిటిషనర్​ పేర్కొన్నారు. విచారణ చేపట్టిన హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది. రికార్డులను పరిశీలిస్తే ఈ భూములు భూదాన్‌ బోర్డుకు చెందినవని పేర్కొంది. ప్రజా ఆస్తి పరిరక్షణ చర్యల్లో భాగంగా వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని కలెక్టర్‌, మహేశ్వరం, ఎల్బీనగర్‌ సబ్‌రిజిస్ట్రార్లలకు ఉత్తర్వులు ఇచ్చింది.

    భూదాన్‌, గ్రామదాన చట్టం ప్రకారం.. దాతలు ఇచ్చిన భూదాన్‌ భూములను పేదలకు వ్యవసాయం, ఇళ్ల నిర్మాణాలకు కేటాయించాల్సి ఉందని హైకోర్టు గుర్తుచేసింది. ఈ భూములు వారసత్వంగా కొనసాగించవచ్చని తెలిపింది. కానీ.. అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

    Bhoodan lands | కొనుగోలు చేసిన ఐఏఎస్​లు, ఐపీఎస్​లు!

    భూదాన్‌ చట్టానికి విరుద్ధంగా సొంత పేర్లతోపాటు కుటుంబసభ్యుల పేరిట ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు కొనుగోలు చేశారని ఆరోపణలున్నాయి. పోలీసులు, అధికారులు ఫోర్జరీ పత్రాలతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపలు వినిపిస్తున్నాయి. బినామీ లావాదేవీలు నిర్వహించడంతో పాటు చట్టవిరుద్ధంగా భూములను బదలాయింపులు చేసినట్లు తెలుస్తోంది. భూముల బదలాయింపుపై నిషేధం ఉన్నా.. అధికారులు రికార్డులను తారుమారు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రెవెన్యూ రికార్డుల్లో పేర్లు చేర్పించుకుని పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు pattadar pass books కూడా పొందినట్లు ఆరోపణలున్నాయి.

    Bhoodan lands | ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు నోటీసులు

    భూముల వ్యవహారంలో ప్రతివాదులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌, భూదాన్‌ బోర్డు, సీసీఎల్‌ఏతో పాటు సీబీఐ, ఈడీలకు హైకోర్టు నోటీసులిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. నోటీసులు జారీ అయిన వారిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఉన్నారు. అలాగే వారి కుటుంబీకులు, బినామీల పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేసి రికార్డులు సృష్టించారని తెలుస్తోంది.

    More like this

    Mirai Movie | మిరాయ్‌లో రాముడిగా ప్ర‌భాస్.. అస‌లు వాస్త‌వం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mirai Movie | హనుమాన్‌ వంటి బ్లాక్‌బస్టర్ విజయంతో ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్...

    Smart Ration Cards | స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శకత పెంచే ప్ర‌య‌త్నం.. త‌ప్పుల‌ని స‌రిచేసుకునేందుకు డెడ్‌లైన్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Smart Ration Cards | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AP Government) రేషన్ పంపిణీ విధానంలో పారదర్శకతను...

    Sachin Tendulkar | బీసీసీఐ అధ్య‌క్షుడిగా స‌చిన్ టెండూల్క‌ర్.. క్లారిటీ ఇచ్చిన ఎస్ఆర్‌టీ స్పోర్ట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sachin Tendulkar | భారత క్రికెట్ పాలక సంస్థ బీసీసీఐ అధ్యక్ష పదవిలో కీలక...