ePaper
More
    HomeతెలంగాణHyderabad | గంజాయి బ్యాచ్​ గ్యాంగ్​ వార్​.. ఓ యువకుడి దారుణహత్య

    Hyderabad | గంజాయి బ్యాచ్​ గ్యాంగ్​ వార్​.. ఓ యువకుడి దారుణహత్య

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad : తెలంగాణ (Telangana capital Hyderabad) రాజధాని హైదరాబాద్​లో లా అండ్​ ఆర్డర్​ అదుపు తప్పిందనే విమర్శలు వెలువడుతున్నాయి.

    గంజాయి సప్లై విచ్చలవిడిగా కొనసాగుతోంది. అమ్మకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. దీంతో యువత గంజాయి మత్తులో జోగుతున్నారు. తాజాగా పాతబస్తీలో చోటుచేసుకున్న ఘటన ఈ వాదనను బలపర్చుతోంది.

    పాతబస్తీ – చంద్రాయణగుట్ట (Old Basti – Chandrayangutta)లో దారుణం చోటుచేసుకుంది. గంజాయి ముఠాల మధ్య తగవు ఏర్పడింది. గంజాయి, స్టెరాయిడ్స్‌ అమ్మకాల్లో ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అజీజ్‌ అనే యువకుడిని దారుణంగా హతమార్చారు. అజీజ్‌ స్టెరాయిడ్స్‌ తీసుకుంటుండగా ప్రత్యర్థులు హత్య చేసినట్లు తెలుస్తోంది.

    పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి (Osmania Hospital) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Hyderabad : సర్కారు ఎన్ని చర్యలు తీసుకున్నా..

    డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ ప్రభుత్వం కఠినంగానే వ్యవహరిస్తోంది. డ్రగ్స్ నిర్మూలనకు ఇటీవలే ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చింది. దీనికి తోడు డ్రగ్స్ నివారణపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహించారు. సైబరాబాద్​ పరిధిలో నిర్వహించిన సదస్సులో సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

    Hyderabad : ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా..

    అయితే, సర్కారు ఎన్ని చర్యలు తీసుకున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదనే విషయం తాజా ఘటనతో స్పష్టం అవుతోంది. తనిఖీల్లో కొన్ని ప్రాంతాలను మినహాయిస్తున్నారనే ఆరోపణలు ఈ హత్యోదంతం నిజం చేస్తోంది. చిన్న తప్పిదానికే సామాన్యుల వెంట పడుతూ వేధించే పోలీసులు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

    Hyderabad : విశ్వ వేదికపై మెరుపులు..

    తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలతో ఓ వైపు భాగ్యనగరం విశ్వ వేదికపై తణుకులీనుతోంది. ఇటీవలే ప్రపంచ సుందరి పోటీలకు హైదరాబాద్​ ఆశ్రయం కల్పించి, ప్రపంచ దేశాల మనసు దోచింది. పాతబస్తీ (OLD CITY) చరిత్రను కూడా చాటింది. ఇలా రాష్ట్ర రాజధాని ఓ వైపు విశ్వవ్యాప్తంగా మన్ననలు అందుకుంటుంటే.. ఇలాంటి నేరాలు మాయని మచ్చగా మారే ప్రమాదం ఉంది.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...