ePaper
More
    Homeక్రైంDichpalli | దుబాయి నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో మృతి

    Dichpalli | దుబాయి నుంచి వచ్చి.. రోడ్డు ప్రమాదంలో మృతి

    Published on

    అక్షరటుడే, డిచ్‌పల్లి : Dichpalli | ఆ యువకుడు బతుకుదెరువు కొన్నేళ్లుగా దుబాయిలో ఉంటున్నాడు. అక్కడ పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నాడు. ఇంటికొచ్చి పెళ్లి చేసుకొని స్థిర పడాలనుకున్నాడు. ఈ క్రమంలో వారం క్రితం దుబాయి నుంచి స్వగ్రామానికి వచ్చాడు. అంతలోనే రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆ యువకుడిని కబలించింది. ఈ విషాద ఘటన డిచ్​పల్లి మండలంలో (Dichpalli mandal) చోటు చేసుకుంది.

    డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​ గ్రామానికి (Ghanpur village) చెందిన ఒడ్డేపల్లి రంజిత్‌(30) కొంతకాలంగా దుబాయిలో పని చేస్తున్నాడు. అయితే ఇంటికి వచ్చి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో వారం క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి బైక్​ వెళ్తుండగా ఘన్​పూర్​ సమీపంలో అదుపు తప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ రంజిత్​ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామాంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లి చేసుకుంటాడనుకున్న కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...