ePaper
More
    HomeతెలంగాణTeenmar Mallanna | తీన్మార్‌ మల్లన్నపై నవీపేట్‌లో ఫిర్యాదు

    Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్నపై నవీపేట్‌లో ఫిర్యాదు

    Published on

    అక్షరటుడే, బోధన్​: Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై నవీపేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఎమ్మెల్సీ కవితపై (MLC Kavitha) అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బినోల సొసైటీ ఛైర్మన్‌ మగ్గరి హన్మాండ్లు తెలిపారు.

    Teenmar Mallanna | రెండేళ్లుగా కవిత పోరాటం..

    బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత రెండేళ్లుగా పోరాటాలు చేశారని, బీసీలను రాజకీయంగా వాడుకుంటున్న తీన్మార్‌ మల్లన్న (Teenmar Mallanna) చేసిన ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమని అన్నారు. ఇలాంటి పునరావృతం జరిగితే గ్రామాల్లో తిరగనీయకుండా అడ్డుకుంటామని అన్నారు. ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్‌ మల్లన్నను కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నవీపేట్‌ సొసైటీ ఛైర్మన్‌ అబ్బన్న, నాయకులు ప్రవీణ్, సూరిబాబు, నర్సయ్య, సతీష్, జాఫర్, నయీం, కృష్ణ, పోతన్న, అర్జున్, తదితరులున్నారు.

    More like this

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...

    CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో కలకలం.. తుపాకితో బెదిరించి దోపిడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CPL | కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బార్బడోస్‌లో...