ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSP Rajesh Chandra | అంకిత భావంతో విధులు నిర్వహించాలి

    SP Rajesh Chandra | అంకిత భావంతో విధులు నిర్వహించాలి

    Published on

    అక్షరటుడే, లింగంపేట: SP Rajesh Chandra | పోలీస్ సిబ్బంది విధులను అంకితభావంతో నిర్వహించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. లింగంపేట (Lingampet) పోలీస్ స్టేషన్​ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.15 నిమిషాలకు స్టేషన్​కు చేరుకున్న ఎస్పీ మధ్యాహ్నం వరకు స్టేషన్​లోని పెండింగ్​ కేసులను పరిశీలించారు. సిబ్బంది విధులపై సమాచారం సేకరించారు.

    SP Rajesh Chandra | సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి

    సిబ్బంది సైబర్ నేరాలపై (Cyber crime) అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు. దీనిపై మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.

    SP Rajesh Chandra | సిబ్బంది ప్రజలతో మమేకం కావాలి

    పోలీస్ సిబ్బంది ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీస్ (Friendly Police) విధానాన్ని పక్కాగా అమలు చేయాలని ఎస్సీ సిబ్బందికి సూచించారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో పోలీసు సిబ్బంది దత్తత తీసుకుని శాంతిభద్రతల పర్యవేక్షణ నిర్వహించాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మైనర్లకు ఎట్టిపరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని, వారికి వాహనాలిస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

    SP Rajesh Chandra | సీసీ కెమెరాలు పెంచాలి

    ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీస్ సిబ్బంది సమానమని, ప్రతి వ్యాపార సముదాయంలో, గ్రామాల్లో, ప్రయాణ ప్రాంగణాలు, ప్రధాన కూడళ్లలో ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలను ఏర్పాటుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ అన్నారు. సీసీ కెమెరా (CC cemara) కనబడితే అప్రమత్తంగా ఉంటారని, దొంగతనాల నిహారణకు చాలా దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాల బిగింపునకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాజారెడ్డి, ఎస్సై దీపక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...