ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​YSRCP | నేను తలచుకుంటే వారి ఇళ్లు కూల్చి ఎత్తుకురాగలను : ప్రసన్నకుమార్​రెడ్డి

    YSRCP | నేను తలచుకుంటే వారి ఇళ్లు కూల్చి ఎత్తుకురాగలను : ప్రసన్నకుమార్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YSRCP | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో రాజకీయాలు రోజురోజుకు కాకరేపుతున్నాయి. ఇటీవల గుడివాడలో టీడీపీ వైసీపీ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (Nallapureddy Prasannakumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

    వైసీపీ నేత ప్రసన్నకుమార్‌రెడ్డి ఇటీవల కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి (TDP MLA Prashanthi Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిపై స్పందిస్తూ వేమిరెడ్డి దంపతులే (Vemireddy Couple) తన ఇంటిపై దాడి చేయించారన్నారు. సాక్ష్యాలు, వీడియోలు చూపించినా పోలీసులు కేసు పెట్టడం లేదని ఆరోపించారు. తాను తలుచుకుంటే పది వేల మందితో వెళ్లి వేమిరెడ్డి ఇల్లు కూల్చి వారిని ఎత్తుకు రాగలనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

    YSRCP | కేసు నమోదు

    టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే ప్రసన్నకుమార్​రెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు (Kovur Police) కేసు పెట్టారు. కాగా నియోజకవర్గంలోని పడుగుపాడులో జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పేర్ని నాని సైతం కార్యకర్తల సమావేశంలో కన్ను కొడితే పని అయిపోవాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కార్యకర్తలను రెచ్చగెట్టేలా మాట్లాడారని ఆయనపై కూడా కేసు నమోదైంది.

    More like this

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...