ePaper
More
    Homeబిజినెస్​Tata Motors | టాటా మోటార్స్‌ డిస్కౌంట్‌ మేళా.. హారియర్‌ ఈవీపై రూ. లక్ష వరకు...

    Tata Motors | టాటా మోటార్స్‌ డిస్కౌంట్‌ మేళా.. హారియర్‌ ఈవీపై రూ. లక్ష వరకు తగ్గింపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Tata Motors | ప్రముఖ దేశీయ కార్ల తయారీ కంపెనీ అయిన టాటా మోటార్స్‌ (Tata motors) తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. హారియర్‌ (Harrier), టియాగో, నెక్సాన్‌ మోడళ్లను తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. ఇది పరిమిత కాలపు ఆఫర్‌. ఎంపిక చేసిన వేరియంట్‌లపై, అదీ కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంది. పూర్తి వివరాలకు సమీపంలోని టాటా మోటార్స్‌ డీలర్‌ను గాని కంపెనీ వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించాలి.

    టాటామోటార్స్‌ గతనెల (June)లో 37,083 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో 43,527 యూనిట్లను విక్రయించడం గమనార్హం. అంటే గతేడాదితో పోల్చితే అమ్మకాలు 15 శాతం వరకు తగ్గాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్‌ మార్కెట్‌ షేరును పెంచుకోవడంపై దృష్టి సారించింది. పలు మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. హారియర్‌ ఈవీపై అత్యధికంగా రూ.లక్ష వరకు డిస్కౌంట్‌ అందిస్తోంది.

    Tata Motors | టియాగోపై రూ. 40 వేలు..

    టాటా టియాగో (Tata tiago) ఈవీ లాంగ్‌ రేంజ్‌ వేరియంట్‌పై రూ. 40 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లో రూ.20 వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌, రూ. 20 వేలు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌గా పొందొచ్చు. టాటా పంచ్‌(Punch) ఈవీపైనా ఇదే తరహా డీల్‌ను అందిస్తోంది. రూ. 20 వేల తగ్గింపుతోపాటు రూ. 20 వేలు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ ఇస్తోంది.

    టాటా నెక్సాన్‌(Nexon) ఈవీపై రూ. 30 వేల ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ అందిస్తోంది. అదనంగా లాయల్టీ ప్రయోజనాలు, 6 నెలల పాటు టాటా పవర్‌ చార్జింగ్‌ స్టేషన్లలో వెయ్యి యూనిట్ల ఉచిత ఛార్జింగ్‌ను కూడా అందిస్తోంది. టాటా కర్వ్‌(curvv) ఈవీపై రూ.50 వేల వరకు ఎక్స్ఛేంజ్‌ బోనస్‌తో పాటు లాయల్టీ రివార్డ్స్‌ పొందవచ్చు. అలాగే మొదటి వెయ్యి మంది కస్టమర్లకు టాటా పవర్‌ చార్జింగ్‌ స్టేషన్లలో 6 నెలల పాటు ఫ్రీ చార్జింగ్‌ సదుపాయం కల్పిస్తోంది.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...