ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Deputy CM | కేసీఆర్ వ‌ల్లే తెలంగాణ‌కు న‌ష్టం.. ఏపీ ప్రాజెక్టుల‌ను అడ్డుకోలేద‌ని భ‌ట్టి ఆగ్ర‌హం

    Deputy CM | కేసీఆర్ వ‌ల్లే తెలంగాణ‌కు న‌ష్టం.. ఏపీ ప్రాజెక్టుల‌ను అడ్డుకోలేద‌ని భ‌ట్టి ఆగ్ర‌హం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Deputy CM | అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ (KCR) తీరు వ‌ల్లే తెలంగాణ‌కు తీర‌ని న‌ష్టం జ‌రిగింద‌ని ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భట్టివిక్ర‌మార్క(Deputy CM Bhattivikramarka) విమ‌ర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రాజెక్టులు క‌డుతుంటే అడ్డుకోలేద‌ని మండిప‌డ్డారు. త‌ప్పంతా వారు చేసి ఇప్పుడు త‌మ‌పై ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

    ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ నుంచి సాగర్ నీటిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy)తో క‌లిసి భట్టి సోమ‌వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. బీఆర్ ఎస్ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.

    Deputy CM | రైతుకు అండ‌గా కాంగ్రెస్‌..

    కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) రైతుకు అండ‌గా నిలుస్తోంద‌ని భ‌ట్టి చెప్పారు. వ్యవసాయం, రైతులకు చేయూత‌నిస్తోంద‌ని. ఏడాదిన్న‌ర కాలంలోనే రైతు సంక్షేమానికి 1.10 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని వివ‌రించారు. రైతులు(Farmers) పండించిన పంటకు పెట్టుబడిగా రైతు భరోసా, రూ.9 వేల కోట్లు ఇచ్చామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో సన్నవడ్లకు బోనస్ ఇచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం, కరెంట్, ప్రాజెక్ట్‌లు అని అభివర్ణించారు.

    గత కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ(Telangana) రాష్ట్రానికి భారంగా మారాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తాము మూల్యం చెల్లిస్తోందన్నారు. గతంలో శ్రీశైలంపై ఏపీ ప్రభుత్వం(AP Government) ప్రాజెక్ట్‌లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ తప్పులు చేసి, వాటిని ఇప్పుడు తమపై రుద్దాలని చూస్తున్నారని మండిప‌డ్డారు.

    Deputy CM | ఆర్థిక క‌ష్టాలున్నా..

    రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆర్థిక క‌ష్టాలు ఉన్న‌ప్ప‌టికీ, రైతుల సంక్షేమాన్ని ఆప‌డం లేద‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామన్నారు. గత ఏడాది కనీవినీ ఎరుగని వరదల కారణంగా సాగర్ మెయిన్ కెనాల్ పూర్తిగా కొట్టుకుపోయిందని.. దానిని పునరుద్ధరించామని తెలిపారు. 2,55,324 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు.

    కృష్ణా బేసిన్‌లో వచ్చే నీటితో మొదటి పంటకు ఎలాంటి ఢోకా లేదని, నాగార్జున సాగర్ ఆయకట్టుకు పూర్తి స్దాయిలో సాగునీరు విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) రాష్ట్రాన్ని అప్పుల కుప్పచేసినా.. తమ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడుతోంద‌న్నారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు అన్నదాతల ఖాతాలో వేశామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి పేర్కొన్నారు.

    More like this

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...