ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMLA Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి..: హరీశ్ రావు

    MLA Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి..: హరీశ్ రావు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: MLA Harish Rao | స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతిఒక్క బీఆర్​ఎస్​ కార్యకర్త సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్​ రావు సూచించారు. నియోజకవర్గ బీఆర్​ఎస్​ నాయకులు సోమవారం హైదరాబాద్​లో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

    MLA Harish Rao | త్వరలో బాన్సువాడ ఇన్​ఛార్జీని నియమిస్తాం..

    ఈ సందర్భంగా హరీష్​రావు మాట్లాడుతూ.. త్వరలోనే బాన్సువాడ నియోజకవర్గానికి ఇన్​ఛార్జీని నియమిస్తామని స్పష్టం చేశారు. అనంతరం బాన్సువాడలో తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీశారు. లోకల్​బాడీ ఎలక్షన్లలో బాన్సువాడలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు.

    MLA Harish Rao | కాంగ్రెస్​ విధానాలను ఎండగట్టాలి..

    ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్​ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను గ్రామాల్లో ఎండగట్టాలని హరీష్​ రావు సూచించారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనలో రైతులకు, మహిళలకు చేసిన అభివృద్ధి పనులను వివరించాలని ఆయన స్పష్టం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొంటానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీఆర్ఎస్​ మాజీ రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా ఎర్రవట్టి, బోడ రాంచందర్, శ్రీనివాస్, కుర్మ గంగారాం, లక్ష్మణ్, శంకర్, భూమన్న ఉన్నారు.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...