ePaper
More
    Homeటెక్నాలజీAI Buds | ‘హాయ్‌ మివి’.. విశేషాలేంటి?.. ‘మివి’ నుంచి నయా AI ఇయర్​ బడ్స్​..

    AI Buds | ‘హాయ్‌ మివి’.. విశేషాలేంటి?.. ‘మివి’ నుంచి నయా AI ఇయర్​ బడ్స్​..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: AI Buds | దేశీయ కన్జూమర్‌ ఎల్రక్టానిక్స్‌ సంస్థ మివి(Mivi) భారతీయులకోసం సరికొత్త బడ్స్‌(Buds)ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. కృత్రిమ మేథ ఆధారిత ఏఐ బడ్స్‌(AI buds) కావడం వీటి ప్రత్యేకత. ఇది ఎనిమిది దేశీయ భాషలను అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తుంది. ఆ ఎనిమిది భాషలలో (Eight languages) మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. ఇందుకోసం ఎలాంటి సెట్టింగ్స్‌ మార్చాల్సిన అవసరం లేదు. యూజర్ల ప్రాధాన్యతలను గుర్తుపెట్టుకుని, సందర్భానుసారంగా స్పందించేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తోపాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ బడ్స్‌ స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేద్దామా..

    ఈ ఏఐ బడ్స్‌లో మివి ఏఐ అనే ప్రొప్రైటరీ వాయిస్‌ అసిస్టెంట్‌ (Voice Assistant) ఉంది. ‘‘హాయ్‌ మివి’’ అనగానే ఈ వాయిస్‌ అసిస్టెంట్‌ ప్రతిస్పందిస్తుంది. ఇది తెలుగు(Telugu), హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ వంటి ఎనిమిది భారతీయ భాషలను సపోర్ట్‌ చేస్తుంది. దీనికోసం లాంగ్వేజ్‌ సెట్టింగ్స్‌ మార్చాల్సిన పనిలేదు. ఎలాంటి సెట్టింగ్స్‌ మార్చకుండానే ఏఐ ఆధారితంగా వినియోగదారులు ఏ భాషలో మాట్లాడినా స్పందిస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న మివి ఏఐ యాప్‌ ద్వారా యూజర్లు ఏఐ సెట్టింగ్స్‌, ఫీచర్లను మేనేజ్‌ చేసుకోవచ్చు. ఈ బడ్స్‌ సింగిల్‌ ఛార్జింగ్‌పై 40 గంటల బ్యాటరీ లైఫ్‌ కలిగి ఉంటాయి. 3D సౌండ్‌స్టేజ్‌, స్పష్టత కోసం క్వాడ్‌ మైక్‌ మొదలైన ప్రత్యేకతలు ఉన్నాయి. వీటి ధర రూ. 6,999. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో 5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌ (Cash back) లభిస్తుంది.

    AI Buds | అవతార్‌ ద్వారా..

    వినియోగదారుల ప్రశ్నలను అర్థం చేసుకుని సమాధానాలు ఇవ్వడానికి ఇందులో ‘అవతార్‌’(Avatar) ఆప్షన్స్‌ ఉన్నాయి. ఒక్కో అంశానికి ఒక్కో అవతార్‌ సమాధానాలు ఇస్తుంది. అసిస్టెంట్‌ అవతార్‌ల ద్వారా మివి ఏఐ బడ్స్‌ వివిధ పనులకు సహకారం అందిస్తుంది. ఇవి ప్రీ డిఫైన్డ్‌ మాడ్యుల్స్‌.న్యూస్‌ రిపోర్టర్‌ అవతార్‌ యూజర్‌ ఆసక్తుల ఆధారంగా న్యూస్‌ అప్‌డేట్స్‌(News updates) అందిస్తుంది. ఇంటర్వ్యూవర్‌ అవతార్‌ మాక్‌ ఇంటర్వ్యూలు, ఫీడ్‌ బ్యాక్‌ అందిస్తుంది. చెఫ్‌ అవతార్‌ వంట చేయడంలో సూచనలిలస్తుంది. వెల్‌నెస్‌ కోచ్‌ అవతార్‌ సంభాషణల సమయంలో యూజర్‌ ఇన్‌పుట్‌లకు స్పందిస్తుంది. జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు గురు అవతార్‌(Guru avatar) సమాధానాలిస్తుంది.

    More like this

    Stock Markets | లాభాల బాటలో మార్కెట్లు.. 25 వేల మార్క్‌ను టచ్‌ చేసిన నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | భారత్‌, యూఎస్‌ల మధ్య వాణిజ్య చర్చలపై ఆశలు చిగురిస్తుండడం, ఐటీ సెక్టార్‌(IT...

    Asia Cup | బోణీ కొట్టిన ఆఫ్ఘ‌నిస్తాన్.. ఆదుకున్న అటల్ , అజ్మతుల్లా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Asia Cup | గ‌త రాత్రి ఆసియా కప్‌–2025 అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. తొలి మ్యాచ్‌లో...

    Indian Railway Jobs | పదో తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indian Railway Jobs | భారతీయ రైల్వేలో (Indian Railway) ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి...