అక్షరటుడే, వెబ్‌డెస్క్: Current Bill | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఓ రిటైర్డ్ హెడ్‌మాస్టర్‌కు వచ్చిన కరెంట్ బిల్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. ఎందుకంటే ప్రతి నెల తక్కువ బిల్లు వచ్చేది. రూ.1300–1500 కు మించేది కాదు.
కానీ, తాజా బిల్లులో ఏకంగా రూ.లక్షలు దాటింది ఏకంగా రూ.15,14,993 వచ్చింది. అందుకే ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. ఈ సంఘటన కోనసీమ Konaseema జిల్లా మామిడికుదురు మండలం పరిధిలో చోటుచేసుకుంది. బాధితుడు నన్నేషా హుస్సేన్ అనే రిటైర్డ్ స్కూల్ హెడ్‌మాస్టర్. విద్యార్థులకు నూతన భవిష్యత్తును తీర్చిదిద్దిన ఓ గొప్ప ఉపాధ్యాయుడికి ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థే నిరాశ కలిగించిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
Current Bill : బిల్లు చూసి అవాక్కయ్యారు…
నన్నేషా హుస్సేన్ గత నెల కరెంట్ బిల్లు చూస్తే అందులో 1,00,846 యూనిట్లు వినియోగించారని ఉంది. ఆ మేరకు రూ.15,14,993 రూపాయల బిల్లు వేయబడింది. దీనిపై ఆయన తీవ్ర ఆవేదనతో స్పందించారు.. “ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. నేను సగటు పౌరుడిని, రిటైర్డ్ వ్యక్తిని. ఇంత ఎక్కువ కరెంట్ Current ఎలా వాడతాను? మాకు ఈ దెబ్బతో ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. బిల్లు గురించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ లైన్‌మన్‌ను అడిగితే, మీటరు సరిగ్గా పనిచేయడం లేదని తెలిపాడట. “మీటరులో తప్పు ఉంది, కొత్త మీటర్ కోసం అప్లై చేసుకోండి” అని అధికారుల నుంచి సమాధానం వచ్చినట్లు హుస్సేన్ చెప్పారు.
“డబ్బు ఇచ్చి నేను డిజిటల్ మీటర్ పెట్టించుకున్నాను. ఇప్పుడు మీటర్ Meter లోపం ఉందని చెప్పడం దురదృష్టకరం. నేను మళ్లీ మీటర్‌కు అప్లై చేయను. ఇది ప్రభుత్వ వైఫల్యం. నేను చాలా ఆవేదనతో ఉన్నాను. నాకే ఇలా ఉంటే మరి పేదల పరిస్థితి ఏమిటి?..” అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది వినియోగదారులకు డిజిటల్ మీటర్ల వ్యవహారంలో ఇలాంటి అనుమానాస్పద బిల్లులు వస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి. కరెంట్ వినియోగం తగ్గినప్పటికీ, బిల్లులు ఎక్కువగా రావడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
“ఈ సంఘటనను రాష్ట్ర విద్యుత్ శాఖ సీరియస్‌గా పరిగణించాలి.. సాధారణ వినియోగదారుని రూ.లక్షల్లో బిల్లు వేసి, దానిని చెల్లించమని కోరడం అన్యాయం.. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధితుడికి న్యాయం చేయాలి” అని ప్రజాప్రతినిధులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.