ePaper
More
    HomeతెలంగాణCM Revanth Reddy | కేసీఆర్​ తన అక్కసును వెళ్లగక్కారు: సీఎం రేవంత్​

    CM Revanth Reddy | కేసీఆర్​ తన అక్కసును వెళ్లగక్కారు: సీఎం రేవంత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:CM Revanth Reddy | బీఆర్​ఎస్​ సభలో కేసీఆర్(KCR)​ తన అక్కసును వెళ్లగక్కారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జానారెడ్డి(Jana Reddy)తో చర్చల అనంతరం మీడియాతో చిట్​చాట్​గా మాట్లాడారు. తాను సీఎం(CM) అయిన రెండో రోజే కేసీఆర్​ గుండె పగిలిందని వ్యాఖ్యానించారు. ఇప్పడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆరే(KCR) కారణమన్నారు.

    రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసింది కేసీఆర్​ కాదా..? అని ప్రశ్నించారు. మావోయిస్టు శాంతి చర్చల కమిటీ రిక్వెస్ట్​ను అధిష్టానానికి పంపిస్తామని తెలిపారు. పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే అందుకు కట్టుబడి పని చేస్తామని పేర్కొన్నారు. ఆపరేషన్​ కగార్(Operation Kagar)​పై జాతీయస్థాయిలో చర్చ జరగాలని తెలిపారు. గతంలో మావోయిస్టులతో జానారెడ్డి, కేకేనే చర్చలు చేశారని సీఎం పేర్కొన్నారు. ఆ వ్యవహారం అంతా జానారెడ్డి, కేకేలే చూస్తారని చెప్పారు.

    More like this

    ACB Raids | ఏసీబీ అధికారుల దూకుడు.. పాఠశాలల్లో తనిఖీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raids | ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నిత్యం దాడులు చేపడుతూ.. అవినీతి...

    Excise Department | మత్తుపదార్థాలు రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Excise Department | అల్ప్రాజోలం రవాణా చేస్తున్న ఒకరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు....

    Mumbai Navy Yard | నేవీ యార్డులో ఆయుధాల చోరీ.. నేవీ కానిస్టేబుల్, అతడి సోదరుడి అరెస్టు

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Mumbai Navy Yard | తెలంగాణకు చెందిన నేవీ కానిస్టేబుల్ (Navy Constable) దొంగ...