అక్షరటుడే, వెబ్‌డెస్క్: President Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు సభ్యులను నామినేట్ చేశారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80(1)(a) ప్రకారం వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 12 మందిని రాజ్యసభకు (Rajya Sabha) నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇటీవల నలుగురు సభ్యులు పదవి విరమణ పొందగా.. వారి స్థానంలో ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, దౌత్యవేత్త హర్ష్ వర్ధన్ శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్ మీనాక్షి జైన్, కేరళకు చెందిన సామాజిక కార్యకర్త సదానందన్‌ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు.
President Droupadi Murmu | అభినందించిన ప్రధాని మోదీ
కొత్తగా రాజ్యసభకు నామినేట్ అయిన వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అభినందించారు. కాగా న్యాయవాది ఉజ్వల్ నికం ముంబై ఉగ్ర దాడుల (Mumbai terror attacks) విచారణ, ఇతర కీలక కేసుల్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలు అందించారు.
2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీగా పోటీ చేసిన నికమ్.. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. తాజాగా రాష్ట్రపతి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీనిపై మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఆయన ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి కృషి చేశారన్నారు. రాష్ట్రపతి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఆనందంగా ఉందన్నారు.
President Droupadi Murmu | దౌత్యవేత్తగా కీలక పదవులు
మాజీ విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ శ్రింగ్లా (Former Foreign Secretary Harsh Vardhan Shringla) అమెరికా, బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాల్లో రాయబారిగా పనిచేశారు. 2023లో భారత్‌లో నిర్వహించిన జీ 20 సమ్మిట్‌కు ఆయన చీఫ్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు.
President Droupadi Murmu | ఉపాధ్యాయుడి నుంచి పెద్దల సభకు..
కేరళకు చెందిన సదానందన్ అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు. 1999 వరకు ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో కొనసాగుతున్నారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో (2021 Kerala Assembly elections) ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాగా 1994 జనవరి 25న సదానందన్పై దాడి జరిగింది. కన్నూర్‌లోని నివాసం సమీపంలో దుండగులు ఆయనపై దాడి చేసి రెండు కాళ్లు నరికివేశారు. ఈ దాడిని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సభ్యులు చేశారనే ఆరోపణలున్నాయి.
ప్రముఖ చరిత్రకారిణి, మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మీనాక్షి జైన్‌ను కూడా ద్రౌపది ముర్ము పెద్దల సభకు ఎంపిక చేశారు. భారత చరిత్ర రంగానికి, విద్యా రంగానికి ఆమె ఎంతో సేవలందించారు. ఆమె పండితురాలు, పరిశోధకురాలు, చరిత్రకారిణిగా ప్రత్యేకతను చాటుకున్నారు.