ePaper
More
    Homeక్రీడలుShahid Afridi | ఉగ్రదాడి.. భారత బలగాల చేతకాని తనం: అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

    Shahid Afridi | ఉగ్రదాడి.. భారత బలగాల చేతకాని తనం: అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Shahid Afridi | భారత సైన్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది cricketer Shahid Afridi సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత బలగాల చేతకాని తనంతోనే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి(Pahalgam Terror Attack) చోటు చేసుకుందని ఆరోపించాడు. భారత సైన్యం సరైన భద్రత కల్పించి ఉంటే ఈ ఘటనే జరిగేది కాదని అభిప్రాయపడ్డాడు. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్‌(Pakistan)పై నిందలు మోపుతున్నారని తెలిపాడు. భారత మీడియా, క్రికెటర్లు అందరూ పాకిస్థాన్‌ను నిందించే పనిలో పడ్డారని అసహనం వ్యక్తం చేశాడు.

    ఈ నెల 22న పహల్గాం(Pahalgam)లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడిని ఖండించిన భారత ప్రభుత్వం(Indian Government).. పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు ఉపక్రమించింది. అంతర్జాతీయంగా పాక్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది.

    భారత ప్రభుత్వ చర్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అఫ్రిది(Afridi).. రోజుకో ఛానెల్‌తో మాట్లాడుతూ.. భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు. భారత్‌లో పటాకులు కాల్చినా పాకిస్థాన్‌నే నిందిస్తారని సెటైర్లు పేల్చాడు. ‘భారత్‌లో పటాకులు కాల్చిన పాకిస్థానే కారణమంటారు. కశ్మీర్‌లో 8 లక్షల మంది భారత సైనికులు ఉన్నారు. అయినా ఉగ్రదాడి(Terror Attack) చోటు చేసుకుందంటే.. వారి వైఫల్యం స్పష్టంగా అర్థమవుతోంది. వారి చేతకాని తనం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజలకు భద్రత కల్పించడంలో భారత సైన్యం విఫలమైంది.” అని ఆఫ్రిది వ్యాఖ్యానించారు.

    కాగా.. ‘ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలోనే భారత మీడియా(Indian media) పాకిస్థాన్‌పై నిందలు మోపడం ప్రారంభించింది. భారత మీడియా మాటలు నాకు నవ్వును తెప్పించాయి. భారత స్టార్ క్రికెటర్లు(Indian Star Cricketers) కూడా పాకిస్థాన్‌ను నిందిస్తున్నారు. అసలు క్రీడలకు రాజకీయాలకు ఏం సంబంధం’ అని షాహిద్ అఫ్రిది వ్యాఖ్యలు చేశారు.

    Latest articles

    GST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి నుంచి అంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST reforms : కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి....

    New Bar Policy | కొత్త బార్​ పాలసీ.. 10 శాతం వారికి వాటా.. ఇక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే..

    అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరి ఎక్పైజ్‌ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)​లో...

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను...

    More like this