ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిTiger | రెడ్డిపేట తండా అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం..

    Tiger | రెడ్డిపేట తండా అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం..

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Tiger | రామారెడ్డి మండలం రెడ్డిపేట స్కూల్ తండా (Reddypet School Thanda) అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా తండా శివారులో పులి సంచరిస్తున్నట్టుగా ప్రజలు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం ఓ ఆవుపై (Cow) పులి దాడి చేసి చంపిందని పేర్కొన్నారు.

    Tiger | ఆవుపై దాడికి యత్నం..

    తాజాగా ఆదివారం మరోసారి ఓ ఆవుపై దాడి చేయగా.. గొంతుకు తీవ్ర గాయమైందని తెలిపారు. పెద్ద పులి సంచారిస్తోందని ప్రచారం జరగడంతో స్కూల్ తండా, బట్టు తండా(battu thanda), జగదాంబ తండా (జగదాంబ తండా) ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అటు వైపు వెళ్లేందుకు ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆవుపై పులి దాడి చేసిన విషయాన్ని తండా వాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.

    ఈ విషయమై ఎఫ్​డీవో రామకృష్ణను వివరణ కోరగా ఫారెస్ట్ రేంజ్ పెద్దది కావడంతో పెద్దపులి తిరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు పెద్దపులి తిరిగినట్టుగా అడుగులు గుర్తించామని తెలిపారు. పెద్ద పులిని గుర్తించేందుకు అడవిలో సీసీ కెమెరాలు, బోన్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

    More like this

    National Lok Adalat | 13న జాతీయ లోక్ అదాలత్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ను కక్షిదారులు సద్వినియోగపర్చుకోవాలని నిజామాబాద్ పోలీస్...

    CM Revanth Reddy | ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​కు తాగునీరు.. కేటీఆర్​కు సీఎం కౌంటర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​కు సీఎం రేవంత్​రెడ్డి...

    Baswa laxmi narsaiah | కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బస్వా లక్ష్మీ నర్సయ్య

    అక్షరటుడే, ఇందూరు: Baswa laxmi narsaiah | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janatha Party) ఆయా మోర్చాల...