ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిAshadam Bonalu | బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం

    Ashadam Bonalu | బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Ashadam Bonalu | ఆషాఢ మాసం సందర్భంగా జిల్లాలో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బాన్సువాడలో ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) సతీసమేతంగా బోనం ఎత్తుకున్నారు.

    పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో (Sangameshwara Colony) బోనాల పండుగలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, భార్య పుష్పతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్​ రెడ్డి మాట్లాడుతూ.. ఆషాఢమాసంలో బోనాల ఊరేగింపు అనాదిగా వస్తున్న ఆచారమన్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని.. పాడిపంట బాగుండాలని కోరుతూ మహిళలు గ్రామాల్లో బోనాల తీస్తారని వివరించారు.

    Ashadam Bonalu | రుద్రూర్​లో..

    రుద్రూర్ (Rudrur) మండల కేంద్రంలో నిర్వహించిన బోనాల సంబరాల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy) పాల్గొని బోనమెత్తారు. బోనాల పండుగను ప్రజలు అత్యంత ఉత్సాహంతో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కార్యక్రమంలో పోచారం సురేందర్ రెడ్డి (Pocharam surendar Reddy) తదితరులు పాల్గొన్నారు.

    బోనం ఎత్తుకున్న పోచారం భాస్కర్​రెడ్డి

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...