అక్షరటుడే, వెబ్డెస్క్: Weather Updates | రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు (Temperature) పెరిగాయి. రెండు రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి. భారీ వర్షాలు లేక చెరువులు, వాగులు వెలవెలబోతున్నాయి. నిన్నటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఆదివారం ఒక్కసారిగా మారిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.
నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 38–40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మిగతా ప్రాంతాల్లో ఎండ తీవ్రంగానే ఉండడంతో ఉదయం నుంచే ప్రజలు ఉక్కపోత (Heat)తో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆదివారం సాయంత్రం, రాత్రివేళ పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Updates | భారీ వర్షాలు అప్పుడే..
రాష్ట్రంలో భారీ వర్షాలు లేక చెరువులు, వాగులు, నదులు వెలవెలబోతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతోనే కృష్ణ (Krishna), గోదావరి (Godavari) నదులకు వరద వస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో జులై 16 తర్వాత భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని అధికారులు తెలిపారు.