ePaper
More
    Homeటెక్నాలజీJio | జియో మరో సంచలనం.. ఇక మీ టీవీనే కంప్యూటర్‌!

    Jio | జియో మరో సంచలనం.. ఇక మీ టీవీనే కంప్యూటర్‌!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Jio | ఎలక్ట్రానిక్స్‌9 (electronics), డిజిటల్‌ (digital) ప్రపంచంలో రిలయన్స్‌ జియో (reliance jio) మరో సంచలనానికి సిద్ధమైంది. సెట్‌టాప్‌ బాక్స్‌ సాయంతో టీవీని డెస్క్‌టాప్‌గా (desktop) వినియోగించుకునేలా క్లౌడ్‌ (cloud) ఆధారిత వర్చువల్‌ డెస్క్‌టాప్‌ సేవలను ప్రారంభించింది. జియో ప్లాట్‌ఫాంస్‌ జియో పీసీ పేరిట దీనిని లాంచ్‌ చేసింది. రిలయన్స్‌ జియో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు ఉచితంగా ఈ సేవలను అందిస్తోంది. ఫ్రీ ట్రయల్‌ (free trial) కూడా ఇన్విటేషన్‌ ప్రాతిపదికన అందిస్తున్నారు. విడిగా కావాలంటే రూ. 5,499కి కొనుగోలు చేయొచ్చు.

    ఈ ఏఐ ఆధారిత వర్చువల్‌ కంప్యూటింగ్‌ (AI operated virtual computing) సర్వీస్‌ జియో సెట్‌ టాప్‌ బాక్స్‌ ద్వారా అందుబాటులో ఉంటుంది. జియో సెట్‌ టాప్‌ బాక్స్‌తో పాటు కీబోర్డ్‌, మౌస్‌ ఉంటే చాలు.. మీ టీవీ స్క్రీన్‌ను వర్చువల్‌ డెస్క్‌టాప్‌గా మార్చుకోవచ్చు. వినియోగదారులు జియో సెట్‌టాప్‌ బాక్స్‌ను టీవీకి కనెక్ట్‌ చేశాక.. జియో పీసీ యాప్‌ను (Jio PC app) లాంచ్‌ చేయాలి. తర్వాత మౌస్‌, కీబోర్డు కనెక్ట్‌ చేయాలి. జియో పీసీ అకౌంట్‌ను సెటప్‌ చేసుకోవాలి. అపై లాంచ్‌ నౌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే జియో పీసీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి కెమెరాలు, ప్రింటర్లు వంటి పరికరాలకు ఇది సపోర్ట్‌ చేయదు.

    Jio | ఫీచర్లు, వినియోగం ఇలా..

    జియో పీసీ అధికారిక వెబ్‌సైట్‌ ప్రకారం.. లైబ్రే ఆఫీస్‌ అనే మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ (Microsoft office) లాంటి ఓపెన్‌ సోర్స్‌ ఆఫీస్‌ సూట్‌ను దీంట్లో ప్రీఇన్‌స్టాల్‌ అయి ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ యాప్‌లు వాడాలంటే బ్రౌజర్‌ (browser) ద్వారా విడిగా యాక్సెస్‌ చేసుకోవాలి. దీని ద్వారా బ్రౌజింగ్‌ చేసుకోవచ్చని, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసులు, ఇతర అసవసరాలకు వినియోగించుకోవచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. క్లౌడ్‌ ఆధారిత నిర్వహణ వల్ల మెయింటెనెన్స్‌ (maintainance) ఖర్చు కూడా ఉండదు. పూర్తి వివరాలకు కంపెనీ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

    More like this

    Dev Accelerator Limited | నేడు మరో ఐపీవో ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dev Accelerator Limited | ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ వ్యాపారంలో ఉన్న దేవ్‌ యాక్సిలరేటర్ కంపెనీ...

    Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలు.. హైకోర్టు తీర్పుపై అప్పీల్​కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయం!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Group-1 Exams | గ్రూప్​–1 పరీక్షలపై హైకోర్టు (High Court) తీర్పు వెలువరించిన విషయం...

    PM Modi | ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన మోదీ.. భార‌త్‌, అమెరికా స‌హ‌జ భాగ‌స్వాములన్న ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వ్యాఖ్య‌ల‌పై ప్ర‌ధాని మోదీ...