ePaper
More
    HomeసినిమాKota Srinivasa Rao | కోట శ్రీనివాస‌రావు తన జీవితంలో బాగా కుంగిపోయిన ఘ‌ట‌న ఏదో...

    Kota Srinivasa Rao | కోట శ్రీనివాస‌రావు తన జీవితంలో బాగా కుంగిపోయిన ఘ‌ట‌న ఏదో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kota Srinivasa Rao | తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్న గొప్ప నటుల్లో కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఒక‌రు. మొద‌ట చిన్న చిన్న పాత్రలతో నటన ప్రారంభించిన ఆయన ఆ త‌ర్వాత తన అద్భుత ప్రతిభతో కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా అనేక విభిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 90వ దశకంలో బాబు మోహన్ – కోట శ్రీనివాసరావు కలసి తెరపై కనిపించారంటే చాలు, ఆ సినిమా హిట్ అనుకునేవారు. వారి జోడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేది. నిజంగానే ఆ కాంబినేషన్‌కి అప్పట్లో అద్భుతమైన క్రేజ్‌ ఉండేది. వారి హాస్య సన్నివేశాలు ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ సంపాదిస్తున్నాయి.

    Kota Srinivasa Rao | ఇద్దరికీ ఒకేలా..

    తెరపై ప్రేక్షకులకు నవ్వులు పంచిన కోట గారి జీవితంలో ఒక విషాదకర మలుపు చోటుచేసుకుంది. దాదాపు పదేళ్ల క్రితం, ఆయన కుమారుడు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో హఠాన్మరణం చెందాడు. ఈ ఘటన కోట గారిని తీవ్రంగా కుంగదీసింది. ఆ విషాదం తర్వాత ఆయన మానసికంగా కుంగిపోయారు. సినిమాలపై ఆసక్తి కూడా త‌గ్గింది. అదే సమయంలో ఆరోగ్య సమస్యలూ రావడంతో కోట గారు కొంతకాలం సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఓ స‌మ‌యంలో ఈటీవీలో ప్రసారమైన ‘ఆలీతో సరదాగా’ షోలో తన స్నేహితుడు బాబు మోహన్ (Babu Mohan) తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఫేమ‌స్ డైలాగ్ డెలివరీతో మళ్లీ ప్రేక్షకులను అలరించారు.

    సినిమా ఇండ‌స్ట్రీలో కోట‌, బాబు మోహ‌న్‌లు ప్రాణ స్నేహితులు మాదిరిగా ఉంటారు. రోడ్డు ప్ర‌మాదంలో కోట త‌న‌యుడు క‌న్నుమూయ‌గా, అదే మాదిరిగా బాబు మోహ‌న్ త‌న‌యుడు కూడా రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించడం ప్ర‌తి ఒక్క‌రిని క‌లిచి వేసింది. ఇక‌ శ్రీనివాస‌రావు లేర‌నే వార్త‌తో బాబు మోహ‌న్ క‌న్నీరు మున్నీరుగా విల‌పించారు. కోట‌కి ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కోట అంత్య‌క్రియ‌లు ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గంటల‌కు మ‌హా ప్ర‌స్థానంలో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

    Latest articles

    GST reforms | GST సంస్కరణలు.. ఆ వాహనాల ధరలు భారీగా తగ్గే అవకాశం.. ఎప్పటి నుంచి అంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: GST reforms : కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలని అనుకునేవారికి ఇది శుభవార్త అనే చెప్పాలి....

    New Bar Policy | కొత్త బార్​ పాలసీ.. 10 శాతం వారికి వాటా.. ఇక రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవాలంటే..

    అక్షరటుడే, అమరావతి: new bar policy : ఆంధ్రప్రదేశ్​లోని మంగళగిరి ఎక్పైజ్‌ శాఖ కమిషనరేట్(Mangalagiri Excise Department Commissionerate)​లో...

    Putin calls Modi | ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. ఏమి మాట్లాడారంటే..

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Putin calls Modi : అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్​(US President Trump)తో భేటీ తర్వాత​ రష్యా...

    urea problems | ఫర్టిలైజర్​ షాపుల్లో కలెక్టర్​ తనిఖీలు

    అక్షరటుడే, కామారెడ్డి: urea problems : యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను...

    More like this