ePaper
More
    Homeక్రైంPashamylaram | పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

    Pashamylaram | పాశమైలారంలో మరో అగ్ని ప్రమాదం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Pashamylaram | సంగారెడ్డి జిల్లా పాశమైలారం (Pashamylaram) పారిశ్రామికవాడలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల సిగాచి పరిశ్రమ (Sigachi Factory)లో పేలుడు చోటుసుకున్న ఘటన మరువక ముందే ఆదివారం ఉదయం ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమలో భారీగా మంటలు చెలరేగాయి.

    ఎన్వీరో వేస్ట్ మేనేజ్మెంట్ (Enviro Waste Management) పరిశ్రమలో మంటలు ఎగిసి పడుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఆస్పత్రుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తారు. మంటల్లో జేసీబీ, లారీ కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు.

    Pashamylaram | ఆందోళనలో కార్మికులు

    పరిశ్రమల్లో వరుస ఘటనలతో కార్మికులు, పాశమైలారం వాసులు ఆందోళన చెందుతున్నారు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్​ 30న భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 43 మంది మృతి చెందారు. మరో ఏడుగురి ఆచూకీ లభించలేదు. వారు కూడా చనిపోయి ఉంటారని అధికారులు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున, సిగాచి కంపెనీ రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించాయి.

    ఈ ప్రమాదంపై విచారణకు ప్రభుత్వం నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ ఘటనపై విచారణ కొనసాగుతుండగానే.. మరో పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...